– బూర్గంపహాడ్ మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు మందా నాగరాజు
బూర్గంపహాడ్, మే 08 : సర్పంచుల సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని, సర్పంచుల ఐక్యతతో గ్రామాభివృద్ధి సాధ్యమవుతుందని సర్పంచుల సంఘం బూర్గంపహాడ్ మండల అధ్యక్షుడు మందా నాగరాజు అన్నారు. శుక్రవారం సర్పంచుల సంఘం ఎన్నికలు నిర్వహించగా బూర్గంపహాడ్ సర్పంచ్ మందా నాగరాజు సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మండలంలో అన్ని పంచాయతీల సర్పంచులను సమన్వయం చేసుకుని సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పని చేస్తానని తెలిపారు.
ఏ సమస్య ఉన్నా పరిష్కరించేలా చూస్తానని చెప్పారు. సర్పంచుల సంఘం ఉపాధ్యక్షురాలిగా తాటి వాణి, బానోతు పద్మ, గుమ్మడి కృష్ణవేణి, సర్పా నాగమణి, వర్కింగ్ ప్రెసిడెంట్గా పూనం సురేందర్, కోశాధికారిగా కుంజా కొండమ్మ ఎన్నికయ్యారు. మందా నాగరాజును పలువురు సర్పంచులు శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో సభ్యులు గుండి బాబూరావు, బానోతు సరోజ, బొర్రా సుభద్ర, పోతునూరి సూరమ్మ, బొల్లి నిరోషా, బోళ్ల సైదమ్మ, తాటి లక్ష్మి, బానోతు నరసింహ, వర్సా మంగమ్మ పాల్గొన్నారు.