పోక్సో కేసులో పోలీసుల రాజీ!.. బడాబాబులకు కొమ్ముకాస్తున్న అధికారులు
పోక్సో కేసులో నిందితుల అరెస్ట్ విషయంలో కొందరు నిర్లక్ష్యం వహిస్తుండగా.. మరికొందరు నిందితులతో రాజీకుదర్చుకుంటున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. బాలిక భద్రత కోసం తెచ్చిన కఠినమైన పోక్సో చట్టం కూడా రాజకీయ బలం, ధన బలం ముందు మోకరిల్లుతోందనే ఆరోపణలు వస్తున్నాయి.
- ముందస్తు బెయిల్ ప్రయత్నానికి నిందితులకు సమయం
- మొన్న బండి కేసు.. నేడు ఆర్సీపురం
- ఘటనలో అదే తీరు నిందితుడిని కాపాడేందుకు రంగంలోకి రాజకీయ పెద్దలు
- ‘సింహం’ లాంటి అనుచరులతో కుదిరిన ఒప్పందం?
- రూ. 50 లక్షల డీల్?
సిటీబ్యూరో, సెప్టెంబర్ 18 (నమస్తే తెలంగాణ): పోక్సో కేసులో నిందితుల అరెస్ట్ విషయంలో కొందరు నిర్లక్ష్యం వహిస్తుండగా.. మరికొందరు నిందితులతో రాజీకుదర్చుకుంటున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. బాలిక భద్రత కోసం తెచ్చిన కఠినమైన పోక్సో చట్టం కూడా రాజకీయ బలం, ధన బలం ముందు మోకరిల్లుతోందనే ఆరోపణలు వస్తున్నాయి. బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసులో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేయడంలో మీనమేషాలు లెక్కించారు. అనంతరం నాటకీయ పరిణామాల మధ్య అరెస్ట్ చేశారు. బండి భగీరథ్‌ను కాపాడేందుకు రాజకీయ పలుకుబడిని ఉపయోగించారనే ఆరోపణలు సైతం వచ్చాయి.
తాజాగా ఆ కీలక కమిషనరేట్ పరిధిలోనే ఓ పోలీస్‌స్టేషన్ పరిధిలో నమోదైన ఓ పోక్సో కేసులోనూ అధికార పార్టీ కీలక నేతలకు ‘సింహం’ లాంటి అనుచరులు రంగంలోకి దిగి పోక్సో నిందితులను కాపాడేందుకు రాజీ ప్రయత్నాలు చేస్తున్నారనే ఆరోపణలు బహిరంగంగా విన్పిస్తున్నాయి… ఇందుకు ప్రతి ఫలంగా నిందితులతో రూ. 50 లక్షల భారీ డీల్ కుదిరినట్లు స్థానికంగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో పేట్ బషీరాబాద్ పోలీస్‌స్టేషన్‌లో బండి భగీరథ్‌పై నమోదైన మిగతా పోక్సో కేసులోను పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేయడంలో మీనమేషాలు లెక్కించి, ముందస్తు బెయిల్ తిరస్కరణకు గురయ్యే వరకు వేచి చూశారు.
అనంతరం నాటకీయ పరిణామాల మధ్య అరెస్ట్ చేశారు. నిందితుడి తండ్రి ఓ జాతీయ పార్టీలో కీలక పదవిలో ఉండడంతో రాష్ట్ర రాజకీయాలను సైతం ప్రభావితం చేస్తూ కేసు నమోదు కాకుండానే అడ్డుకునే ప్రయత్నం చేసిన విషయం అప్పట్లో సంచలనం సృష్టించింది. పోక్సో కేసుల విషయంలో పోలీసులు అవలంభిస్తున్న ద్వంద నీతిపై ప్రజలు వివిధ రకాలుగా మాట్లాడుకుంటున్నారు. బండి భగీరథ్ కేసులో నిందితుడిని కేసు నుంచి కాపాడేందుకు ప్రయత్నించిన వారిపై కూడా కేసులు నమోదు చేయాల్సి ఉన్నా పోలీసులు ఆ విషయాన్ని తేలికగా తీసుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. తాజాగా మరో కేసు సంచలనం సృష్టిస్తోంది. ఈ కేసులో కొంత మంది నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు రాజకీయ పలుకుబడి ఉన్న వారు నెల రోజుల నుంచి అజ్ఞాతంలో ఉన్నా పట్టుకోవడం లేదని, దీని వెనుక భారీ డీల్ జరిగి ఉంటుందనే ఆరోపణలు చేస్తున్నారు.
బాలికపై లైంగిక దాడి
ఓ ఆలయం వద్ద పనిచేసే ఓ 60 ఏండ్ల వృద్ధుడు ఆలయం వద్దకు వచ్చే బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడనే ఫిర్యాదుపై కీలకమైన కమిషనరేట్ పరిధిలోని ఓ పోలీస్‌స్టేషన్‌లో గత నెల 14న పోక్సో కేసు నమోదయ్యి ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఇందులో ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులకు, దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి రావడంతో మొత్తం నలుగురు నిందితులుగా తేల్చి అందులో ముగ్గురిని అరెస్ట్ చేశారు. మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. పరారీలో ఉన్న నిందితుడు గతంలో టీడీపీలో స్థానిక నాయకుడిగా చలామణి అయ్యాడు.
గతంలో టీడీపీ నాయకుడిగా ఉండటంతో అప్పటి పరిచయాలతో ఈ కేసులో అరెస్ట్ కాకుండా చక్రం తిప్పుతున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. నిందితుడిని అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించేందుకు పోలీసుల తగిన సమయం ఇచ్చారనే ఆరోపణలు వస్తున్నాయి. ఇక్కడే అధికార పార్టీలోని కొందరు ప్రధాన నాయకులకు సంబంధించిన సింహం లాంటి అనుచరులు రంగంలోకి దిగి రూ. 50 లక్షల డిల్ చేశారని, నిందితుడిని పట్టుకోకుండా పోలీసులపై ఒత్తిళ్లు తెస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. కాగా, బండి భగీరథ్‌ను కాపాడేందుకు రాజకీయ పలుకుబడిని ఉపయోగించారనే ఆరోపణలు వచ్చాయి.
తాజాగా 14న నమోదైన కేసులో నిందితుడైన వ్యక్తికి కూడా రాజకీయ పలుకుబడితో పాటు మనీ పలుకుబడి కూడా పనిచేస్తోందనే టాక్ నడుస్తోంది. గతంలో టీడీపీలో పనిచేసి ఉండడంతో ప్రస్తుతం ఆ పార్టీ ఇక్కడ యాక్టివ్‌గా లేకున్నా అప్పటి టీడీపీ నాయకులు కొందరు నిందితుడికి పరిచయాలు ఉన్నాయని, ఆ పరిచయాలతో రాష్ట్ర రాజకీయాలలో ప్రముఖులకు అనుచరుగా ఉంటూ అన్ని వ్యవహారాలు చక్కబెట్టె పాత టీడీపీ నాయకులను సంప్రదించారనే ఆరోపణలు వస్తున్నాయి. ఆ పరిచయాలతోనే నిందితుడు ఈజీగా తప్పించుకుంటున్నాడనే ఆరోపణలు వస్తున్నాయి.
స్థానిక పోలీసులు నిందితుడిని పట్టుకోవడం కోసం ఎంత ప్రయత్నించినా దొరకడం లేదని, డీల్ కుదిర్చిన వాళ్లు ఇచ్చిన సూచనలు, సలహాలతోనే అజ్ఞాతంలో నిందితుడు ఉన్నాడంటూ స్థానికులు మాట్లాడుకుంటున్నారు. పైనుంచి పైస్థాయిలోని అధికారులకు ఒత్తిళ్లు రావడంతో ఈ కేసులో నిందితుడిని అరెస్ట్ చేయడంలో పోలీసులు కూడా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారంటూ స్థానికులు ఆరోపిస్తున్నారు. ముందస్తు బెయిల్ పిటిషన్ విషయంపై కోర్టు రేపో మాపో తీర్పు వెలువరించే అవకాశాలుండడంతో పోలీసులు కూడా బెయిల్ విషయం నిర్ధరణ కాని అన్నట్లుగా ఉన్నారంటూ స్థానిక ప్రజలు మాట్లాడుకుంటున్నారు. పైనుంచి వత్తిళ్లు, పెద్దల డిల్స్తోనే పోలీసులు కూడా చేసేది లేక రాజీమార్గంలో చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని, లేకుంటే ఎందుకు అరెస్ట్ చేయరంటూ స్థానికులు ప్రశ్నిస్తున్నారు

క్షీణించిన శాంతిభద్రతలు ఎమ్మెల్యే అహ్మద్ బిన్ బలాలా
హైదరాబాద్ : నగరంలో శాంతిభద్రతలుగా క్షీణించాయని మలక్‌పేట ఎమ్మెల్యే అహ్మద్ బిన్ బలాలా ఆవేదన వ్యక్తం చేశారు. లా అండ్ ఆర్డర్ పూర్తిగా అదుపు తప్పిందన్నారు. గురువారం రాత్రి తన నియోజకవర్గంలో రెండు నేరాలు జరిగాయన్నారు. నిందితులు రెండు మూడు నెలలు జైల్లో ఉండి వచ్చి మళ్లీ ప్రతాపం చూపుతున్నారని మండిపడ్డారు. సీఎం రేవంత్‌రెడ్డి శాంతి భద్రతలపై సమీక్ష నిర్వహించాలన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

