‘అవినీతికి తావులేకుండా విధులు నిర్వహించాలి’
సింగరేణి సంస్థలో ప్రతి ఉద్యోగి నీతి, నిజాయితీ, నిబద్ధతతో విధులు నిర్వహిస్తూ అవినీతి నిర్మూలనకు కృషి చేయాలని కొత్తగూడెం ఏరియా ఇన్చార్జి జనరల్ మేనేజర్ ఎం.గోవిందారావు పిలుపునిచ్చారు. సోమవారం కొత్తగూడెం ఏరియా జీఎం కార్యాలయంలో విజిలెన్స్ అవగాహన వారోత్సవాలను...
– కొత్తగూడెం ఏరియా ఇన్చార్జి జీఎం ఎం.గోవిందారావు
రుద్రంపూర్, అక్టోబర్ 26 : సింగరేణి సంస్థలో ప్రతి ఉద్యోగి నీతి, నిజాయితీ, నిబద్ధతతో విధులు నిర్వహిస్తూ అవినీతి నిర్మూలనకు కృషి చేయాలని కొత్తగూడెం ఏరియా ఇన్చార్జి జనరల్ మేనేజర్ ఎం.గోవిందారావు పిలుపునిచ్చారు. సోమవారం కొత్తగూడెం ఏరియా జీఎం కార్యాలయంలో విజిలెన్స్ అవగాహన వారోత్సవాలను ప్రారంభించి ఉద్యోగులతో అవినీతి నిర్మూలన ప్రతిజ్ఞ చేయించారు. సంస్థలో పారదర్శకత, జవాబుదారీతనం, సత్ప్రవర్తనను పెంపొందించాలనే లక్ష్యంతో కేంద్ర విజిలెన్స్ కమిషన్ ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న విజిలెన్స్ అవగాహన వారోత్సవాలు సింగరేణిలో అక్టోబర్ 26 నుండి నవంబర్ 1 వరకు కొనసాగనున్నాయి. ఈ ఏడాది ‘నిజాయితీతో సమృద్ధి’ అనే నినాదంతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
ఈ సందర్భంగా గోవిందారావు మాట్లాడుతూ.. అవినీతికి ఆస్కారం లేకుండా ఐటీ ఆధారిత వ్యవస్థలను వినియోగిస్తూ సంస్థలో పారదర్శక పాలనకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఉద్యోగులందరూ నియమ నిబంధనలను కచ్చితంగా పాటిస్తూ ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా విధులు నిర్వర్తించాలని సూచించారు. ప్రతి ఫైల్‌ను అనవసర జాప్యం లేకుండా త్వరితగతిన పరిష్కరించాలని, కొత్తగూడెం ఏరియాను అవినీతి రహిత ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. సంస్థలో ఉత్పత్తి, లాభాలు, భద్రత, కార్మిక సంక్షేమంతోపాటు అవినీతికి తావులేకుండా పారదర్శకంగా విధులు నిర్వహించడం కూడా అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు. సంస్థ అభివృద్ధికి ప్రతి ఉద్యోగి బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు.
కొత్తగూడెం ఏరియాలోని అన్ని గనులు, విభాగాల్లో ఆయా గనుల మేనేజర్లు, విభాగాధిపతులు ఉద్యోగులతో అవినీతి నిర్మూలన ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి జే. గట్టయ్య, ఐఎన్టీయూసీ వైస్ ప్రెసిడెంట్ ఎం.డి.రజాక్, ఏరియా ఇంజినీర్ వి.రామకృష్ణ, డీజీఎం (సివిల్) రాజేంద్ర కుమార్, పర్సనల్ మేనేజర్ తిరుపతి, క్వాలిటీ మేనేజర్ కే. సత్యనారాయణ రాజు, ఇన్చార్జి ఎన్విరాన్మెంట్ ఫజల్ రెహమాన్, ఐటీ మేనేజర్ కే. శేషశ్రీ, రాధా నాగభూషణం (ఐఈడీ), డిప్యూటీ పర్సనల్ మేనేజర్ జి. హరీష్, ఐఎన్టీయూసీ ఫిట్ సెక్రటరీ సీహెచ్. సాగర్‌తోపాటు వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది, కాంట్రాక్టు ఉద్యోగులు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘అవినీతికి తావులేకుండా విధులు నిర్వహించాలి’
Vice President | శ్రీవారిని దర్శించుకున్న భారత ఉప రాష్ట్రపతి
లక్ష్మీపురంలో గ్రామ మహిళా సంఘ భవనం ప్రారంభం
Jobs | డిగ్రీ అర్హతతో రైల్వేలో 1250 స్టేషన్ మాస్టర్ పోస్టులు.. నవంబర్ 25 చివరితేదీ
Boy Fakes Kidnap | తండ్రి నుంచి రూ.5 లక్షలు వసూలు చేసేందుకు.. కిడ్నాప్ నాటకం ఆడిన యువకుడు
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

