వాతావరణ అనుకూల వ్యవసాయంపై రైతులకు అవగాహన
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే) ఆధ్వర్యంలో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం-కిసాన్) పథకం 24వ విడత నిధుల విడుదల కార్యక్రమాన్ని శుక్రవారం ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ విడత నిధులను...
రుద్రంపూర్, అక్టోబర్ 30 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే) ఆధ్వర్యంలో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం-కిసాన్) పథకం 24వ విడత నిధుల విడుదల కార్యక్రమాన్ని శుక్రవారం ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ విడత నిధులను విడుదల చేయగా, దేశవ్యాప్తంగా రైతులకు రూ.18,460 కోట్ల ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ అధికారి బాబురావు మాట్లాడుతూ.. పీఎం-కిసాన్ ద్వారా రైతులకు అందుతున్న ఆర్థిక సహాయాన్ని వ్యవసాయ అవసరాలకు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
కేవీకే సీనియర్ శాస్త్రవేత్త, అధిపతి డాక్టర్ టి.భరత్ మాట్లాడుతూ ఎల్‌నినో ప్రభావంతో వ్యవసాయ రంగానికి ఎదురయ్యే ప్రతికూల పరిస్థితులను వివరించారు. వాతావరణ మార్పులకు అనుగుణంగా ప్రత్యామ్నాయ పంట ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు. ప్రకృతి వ్యవసాయం, పంట అవశేషాల నిర్వహణ, పంటల వైవిధ్యీకరణ, నేల పరీక్షల ఆధారంగా ఎరువుల వినియోగం వంటి పద్ధతులను పాటించడం ద్వారా నేల ఆరోగ్యాన్ని, సారాన్ని కాపాడుకోవచ్చని తెలిపారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
వాతావరణ అనుకూల వ్యవసాయంపై రైతులకు అవగాహన
అర్వపల్లిలో పోలీసుల కార్డెన్ సెర్చ్
Mukra Farmers | ఎండిన పత్తి మొక్కలతో సెల్ఫీలు..రాహుల్‌కు పంపిన ముఖరా( కె ) రైతులు
‘గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదును బాధ్యతగా తీసుకోవాలి’
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

