‘ఏడాది గడిచినా విడుదలకు నోచుకోని కాస్మోటిక్ చార్జీలు’
రాష్ట్రంలోని మైనార్టీ గురుకులాల పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న బాలికలకు చెల్లించాల్సిన కాస్మోటిక్ చార్జీలు ఏడాది గడిచినా ఇప్పటికీ వారి ఖాతాల్లో జమ కాకపోవడం తీవ్ర నిర్లక్ష్యానికి నిదర్శనమని మైనార్టీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు..
– మైనార్టీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ యాకూబ్ పాషా
రుద్రంపూర్, జూన్ 15 : రాష్ట్రంలోని మైనార్టీ గురుకులాల పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న బాలికలకు చెల్లించాల్సిన కాస్మోటిక్ చార్జీలు ఏడాది గడిచినా ఇప్పటికీ వారి ఖాతాల్లో జమ కాకపోవడం తీవ్ర నిర్లక్ష్యానికి నిదర్శనమని మైనార్టీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎండీ యాకూబ్ పాషా సోమవారం ఓ ప్రకటనలో విమర్శించారు. 2024-25 విద్యా సంవత్సరంలో మైనార్టీ బాలికలకు కాస్మోటిక్ కిట్లు పంపిణీ చేసిన ప్రభుత్వం, 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి కాస్మోటిక్ కిట్ల స్థానంలో నగదు మొత్తాన్ని నేరుగా బాలికల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని ప్రకటించిందన్నారు. ఈ మేరకు ఆరు నెలల క్రితమే బాలికలందరికీ బ్యాంకు ఖాతాలు తెరిపించి, వాటి వివరాలను ప్రభుత్వానికి పంపించినప్పటికీ ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా జమ కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
కాస్మోటిక్ కిట్లలో షాంపూ, తలనూనె, టూత్ బ్రష్, దువ్వెన, రెండు రకాల రిబ్బన్లు, బట్టలు ఉతికే సబ్బులు, స్నాన సబ్బులు తదితర వస్తువులు ఉండేవని, వాటి కొనుగోలుకు అవసరమైన మొత్తాన్ని ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉన్నప్పటికీ విద్యా సంవత్సరం పూర్తయి కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమైనా చెల్లింపులు జరగకపోవడం విచారకరమని పేర్కొన్నారు. మైనార్టీ బాలికల సంక్షేమంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపాలని, పెండింగ్‌లో ఉన్న కాస్మోటిక్ చార్జీలను వెంటనే బాలికల బ్యాంకు ఖాతాల్లో జమ చేసి వారికి న్యాయం చేయాలని ఎండి యాకూబ్ పాషా డిమాండ్ చేశారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో పింఛన్ దరఖాస్తుల పరిశీలన
Anupama Parameswaran | డ్యాన్స్ షో ఆఫర్ వస్తే అనుపమ పరమేశ్వరన్ షాకయ్యిందట.. ఎందుకో తెలుసా.. ?
తెగులు మందు కొట్టడంతో క్షీణించిన వరి.. రూ.10 లక్షలు నష్టం?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

