కోతుల బెడద నివారణకు చర్యలు.. సర్పంచ్, ఉప సర్పంచ్‌కు కాలనీవాసుల సన్మానం
కోతుల దాడులతో ఇబ్బందులు పడుతున్న తమ సమస్యను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టిన చుంచుపల్లి మండలం రుద్రంపూర్ పంచాయతీ సర్పంచ్ బానోత్ కేస్లీ, ఉప సర్పంచ్ తోటరాజును పంచాయతీ పరిధిలోని గోపి ఏరియా కాలనీవాసులు సోమవారం సన్మానించారు.
రుద్రంపూర్, అక్టోబర్ 26 : కోతుల దాడులతో ఇబ్బందులు పడుతున్న తమ సమస్యను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టిన చుంచుపల్లి మండలం రుద్రంపూర్ పంచాయతీ సర్పంచ్ బానోత్ కేస్లీ, ఉప సర్పంచ్ తోటరాజును పంచాయతీ పరిధిలోని గోపి ఏరియా కాలనీవాసులు సోమవారం సన్మానించారు. గత రెండు రోజులుగా పంచాయతీ పరిధిలో కోతులను పట్టించే కార్యక్రమం చేపట్టడంతో ఊపిరి పీల్చుకున్నామని వారు తెలిపారు. కోతుల దాడుల్లో పలువురు గాయపడి చికిత్స పొందాల్సి వస్తోందని, నిత్యం భయంతో జీవించాల్సిన పరిస్థితి నెలకొందని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యను సర్పంచ్, ఉప సర్పంచ్, పాలకమండలి, పంచాయతీ కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లగా స్పందించి కోతులను పట్టించే చర్యలు చేపట్టారని పేర్కొన్నారు. పంచాయతీ పరిధిలో కోతుల బెడద పూర్తిగా తొలగేలా వాటిని పట్టించి, అటవీశాఖ నిబంధనల ప్రకారం అడవుల్లో విడిచిపెట్టాలని కోరారు.
ఈ సందర్భంగా సర్పంచ్ బానోత్ కేస్లీ మాట్లాడుతూ.. తగినన్ని నిధులు లేకపోవడంతో సమస్య పరిష్కారంలో జాప్యం జరిగిందన్నారు. అయినప్పటికీ గ్రామ ప్రజల సంక్షేమమే తమకు ముఖ్యమని, కోతుల దాడుల్లో ప్రజలు గాయపడుతున్న ఘటనలను దృష్టిలో ఉంచుకుని ఈ కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. ప్రస్తుతం పంచాయతీ పరిధిలో కోతుల బెడద ప్రధాన సమస్యగా మారిందని పేర్కొన్నారు. ఉప సర్పంచ్ తోటరాజు మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు కోతులను పట్టించే కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. గ్రామంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నామని, ఆదర్శ పంచాయతీగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని చెప్పారు. సన్మాన కార్యక్రమంలో కాలనీవాసులు అఫ్జల్ బీబీ, మేకల సుజాత, వాసంపల్లి స్వప్న, మాదాసు లక్ష్మి, మైల రజిత, సంధ్య, సాదేఖ బేగం, రెహనా పిర్దౌసి, కొండ పద్మ, మున్నిబీ, మంద నాగేశ్వరరావు, కొండ రాజు, మునవర్ పాల్గొన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

