కొత్తగూడెం సింగరేణి, డిసెంబర్ 18: సింగరేణివ్యాప్తంగా ఖాళీగా ఉన్న జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ గ్రేడ్ఈ-1 తొమ్మిది పోస్టుల భర్తీకి ఆదివారం జిల్లాకేంద్రంలోని మహిళా డిగ్రీ కళాశాలలో రాత పరీక్ష జరిగింది. 72 మంది అభ్యర్థులకు హాల్‌టిక్కెట్లు జారీ కాగా 64 మంది పరీక్షకు హాజరయ్యారు. పరీక్షను జీఎం పర్సనల్ (వెల్ఫేర్, ఆర్సీ) కె.బసవయ్య, జీఎం సెక్యూరిటీ హనుమంతరావు, ఎస్వోటూ డైరెక్టర్ ఫైనాన్స్ సుధీర్ పర్యవేక్షించారు. పరీక్షా ఫలితాలను సింగరేణి వెబ్‌సైట్‌తో పాటు హెడ్డాఫీస్ గేట్ వద్ద నోటీసు బోర్డులో ప్రచురిస్తామన్నారు. పర్యటనలో డీజీఎం పర్సనల్ ధన్పాల్ శ్రీనివాస్, డీజీఎం విజిలెన్స్ వీఎన్వీఎస్ఆర్ శాస్త్రి, ప్రిన్సిపాల్ శారద, పర్సనల్ మేనేజర్ వేణుగోపాల్, డిప్యూటీ మేనేజర్ ఐటీ చంద్రశేఖర్, డీవైపీఎం విజిలెన్స్ సమ్మయ్య, సీనియర్ పీవోలు సంతోశ్‌కుమార్, పాషా ఉన్నారు.