చండ్రుగొండ, జూలై 14 : తురక కాశ సంక్షేమ సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడిగా సయ్యద్ బాదుషా నియమితులయ్యారు. ముస్లిం పెద్దల సమక్షంలో సోమవారం హైదరాబాద్ తెలంగాణ ఉర్దూ బోర్డు చైర్మన్ మహమ్మద్ ఉబేదుల కత్వాల్ సమక్షంలో కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తుర్క కాశ రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బడే సాబ్ చేతుల మీదుగా బాదుషా నియామాక పత్రం అందుకున్నారు. చండ్రుగొండ మండలం మహ్మద్‌నగర్ గ్రామానికి చెందిన బాదుషా జిల్లా అధ్యక్షుడిగా నియామకం కావడం పట్ల ప్రజా సంఘాలు, ముస్లిం మైనార్టీ సంఘం నాయకులు, బీఆర్ఎస్ మండల నాయకులు హర్షం వ్యక్తం చేశారు.