బోనకల్లు, ఏప్రిల్ 17 : ఖమ్మం జిల్లా బోనకల్లు మండలం గోవిందపురం (A) గ్రామంలో ఇందిరా మహిళా డైరీలో మెంబర్షిప్ కలిగిన సభ్యులందరికీ గురువారం అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏపీఎం సురేంద్రబాబు మాట్లాడుతూ.. ఈ పథకంలో బర్రెలతో పాటు పాలిచ్చే ఆవులను కూడా ఇచ్చే అవకాశం ఉందన్నారు. సభ్యులందరూ సకాలంలో డాక్యుమెంటేషన్ పూర్తి చేసి సమర్పించాలన్నారు. ఇంకా ఏవరైనా చేరేవారు ఉంటే వెంటనే ఇందిరా డైరీలో సభ్యత్వం తీసుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఇందిరా డైరీ డీపీఎం రాజారావు, సీసీ వెంకటేశ్వర్లు, క్లస్టర్ సీసీ ఝాన్సీ, గ్రామ పెద్దలు భాగం నాగేశ్వరావు, భాగం పాపారావు, డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు.