పాల్వంచ రూరల్, డిసెంబర్ 19 : పాల్వంచ మండలంలోని పెద్దమ్మగుడి ఆలయంలో ఇటీవల నిర్మించిన షాపింగ్ కాంప్లెక్సులు, రెండు ఫంక్షన్ హాళ్లకు మంగళవారం ఆలయ ప్రాంగణంలో దేవాదాయ శాఖ అధికారులు వేలంపాట నిర్వహించారు. రెండు ఫంక్షన్ హాళ్లు, నాలుగు షాపుల వేలంపాట ద్వారా ఆలయానికి రూ.75,48,100 ఆదాయం లభించింది.
కార్యక్రమంలో దేవాదాయ, ధర్మాదాయ శాఖ కొత్తగూడెం డివిజన్ పరిశీలకులు భేల్సింగ్, ధర్మకర్తల మండలి అధ్యక్షుడు మహీపతి రామలింగం, ఈవో రజనీకుమారి, ధర్మకర్తలు పాల్గొన్నారు. బుధవారం ఆలయ హుండీ లెక్కింపు జరుగనున్నట్లు ఈవో తెలిపారు.