Tirumalayapalem | వేతనాలు పెంచండి మహా ప్రభో.. ప్రజా దర్బార్‌లో మంత్రికి వినతిపత్రం అందజేత..!
తిరుమలాయపాలెం, ఏప్రిల్ 25 : తమకు కనీస వేతనాలు ఇప్పించాలని ఆశా వర్కర్లు, అంగన్వాడీలు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి మొర పెట్టుకున్నారు.
తిరుమలాయపాలెం, ఏప్రిల్ 25 : తమకు కనీస వేతనాలు ఇప్పించాలని ఆశా వర్కర్లు, అంగన్వాడీలు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి మొర పెట్టుకున్నారు. ప్రజాదర్బాదర్ సందర్భంగా శనివారం రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగిలేటికి వీరంతా వినతిపత్రం సమర్పించారు.
మండలంలోని సుబ్లేడులో శనివారం సాయంత్రం జరిగిన ప్రజా దర్బార్ సభకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన గ్రామ దీపికలు, ఆశా వర్కర్లు మంత్రికి తమ సమస్యలను విన్నవించుకున్నారు. కనీస వేతనం నెలకు రూ. 26,000 చెల్లించాలని ఆయనను కోరారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ మండల కార్యదర్శి వశ పొంగు వీరన్న తదితరులు పాల్గొన్నారు.

Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

