ఖమ్మం, మార్చి 11 : వివిధ సమస్యలపై అర్జీదారులు సమర్పించిన దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ వీపీ గౌతమ్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన గ్రీవెన్స్ డేలో అర్జీదారుల నుంచి కలెక్టర్ దరఖాస్తులను స్వీకరించి తగు చర్య నిమిత్తం అధికారులను ఆదేశించారు.
ఖమ్మం గుట్టలబజార్కు చెందిన ఎస్డీ.యాకూబ్, ఖమ్మం వెంకటేశ్వర నగర్‌కు చెందిన పి.రజిత, వల్లాల స్వరూపరాణి, ముదిగొండ మండలం మాటూరుపేటకు చెందిన ఎం.వెంకటనర్సమ్మ, తల్లాడ మండలం లక్ష్మీపురానికి చెందిన బి.జగన్మోహన్రెడ్డి, తల్లాడ మండలం కేశవపురానికి చెందిన మాగంటి కమల తమ తమ సమస్యలపై కలెక్టర్ వినతిపత్రాలు సమర్పించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు బి.సత్యప్రసాద్, డి.మధుసూదన్‌నాయక్, డీఆర్వో రాజేశ్వరి, ఆర్డీవో గణేశ్, డీఆర్డీవో సన్యాసయ్య, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.