దమ్మపేట, ఏప్రిల్ 13 : అప్పారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీ వార్షిక మెయింటెనెన్స్ పూర్తి చేసి సోమవారం నుంచి పునః ప్రారంభించనున్నట్లు టీఎస్ ఆయిల్‌ఫెడ్ జనరల్ మేనేజర్, అప్పారావుపేట, అశ్వారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీల మేనేజర్లు సుధాకర్ రెడ్డి, కళ్యాణ్, బాలకృష్ణ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
అశ్వారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీని వార్షిక మెయింటెనెన్స్ చేయడానికి సోమవారం నుంచి నిలిపి వేస్తున్నట్లు తెలిపారు. రైతులు తమ పామాయిల్ గెలలను అప్పారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీకి తీసుకురావాలని మేనేజర్లు సూచించారు.