ఖమ్మం రూరల్, ఆగస్టు 13 : ఖమ్మం జిల్లా పశు వైద్యుల సంఘం అధ్యక్షుడిగా డాక్టర్ అనంతుల హరీశ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ జిల్లా ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్న ఆయన మూడోసారి జిల్లా పశు వైద్యుల సంఘం అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బుధవారం ఖమ్మం నగరంలోని జిల్లా పశు సంవర్ధక శాఖ కార్యాలయంలో నూతన కమిటీ ఎన్నిక జరిగింది. సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిగా డాక్టర్ మానుకొండ రాకేశ్ కుమార్, కోశాధికారిగా డాక్టర్ రఘుపతి, ఈసీ సభ్యులుగా పశు వైద్యులు ఉషశ్రీ, శశిదీప్, జానీ, కృష్ణారెడ్డి, సృజన ఎన్నికయ్యారు.
ఎన్నికల అధికారిగా శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ కె.ప్రదీప్ వ్యవహరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర పశు వైద్యుల సంఘం అధ్యక్షుడు డాక్టర్ ఎం.రమేశ్ బాబు, మాజీ అధ్యక్షుడు డాక్టర్ ఉపేందర్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పశు వైద్యులు అశోక్, సుబ్బారావు, రాంజీ, బోనస్, సమీరా, స్వాతి, లత, ఇతర మండలాల చెందిన పశువైద్యులు పాల్గొన్నారు.
Khammam Rural : ఖమ్మం జిల్లా పశు వైద్యుల సంఘం అధ్యక్షుడిగా అనంతుల హరీశ్