ఖమ్మం రూరల్ : గణేష్ నిమజ్జన వేడుకలకు ఎలాంటి ఇబ్బందులకు కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లను చేశామని ఎదులాపురం మున్సిపాలిటీ కమిషనర్ ఆళ్ల శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. శుక్రవారం మున్సిపాలిటీ పరిధిలోని నాయుడుపేట వద్ద మున్నేరు సమీపంలో ఏర్పాటు చేసిన గణేష్ నిమజ్జన వేడుకల ఘాటును అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను ఆర్ అండ్ బి డి.ఈ చంద్రశేఖర్, రూరల్ పోలీస్ స్టేషన్ సీఐ ముష్కరాజ్ తో కలిసి క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. శనివారం ఉదయం నుంచి గణనాథులు నిమజ్జనానికి తరలివచ్చే అవకాశం ఉంటుందన్నారు. అందుకు అనుగుణంగా గడిచిన వారం రోజుల నుంచి ప్రత్యేక ఏర్పాట్లను చేశామన్నారు. ఇప్పటికే మున్నేరు ఘాటుకు ఇన్ అవుట్ రోడ్లను క్లియర్ చేశామన్నారు. గణేష్ నిమజ్జన వేడుకలు మొత్తం సీసీ కెమెరాల నిఘామధ్య మధ్యలో జరుగుతాయని పేర్కొన్నారు.
నిమజ్జన వేడుకలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా 32 మంది గజ ఈతగాళ్లు 14 మంది ఎన్టీఆర్ ఎఫ్ సిబ్బంది అందుబాటులో ఉంటారన్నారన్నారు. ఉత్సవ కమిటీ సభ్యులు పోలీస్ అధికారులకు సహకరించి శోభయాత్ర విజయవంతం జరిగే విధంగా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు ఆర్ అండ్ బి అధికారులు మున్సిపల్ అధికారులు శ్రీధర్ రెడ్డి, మనీ కిరణ్ , శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.