ఖమ్మం రూరల్, ఏప్రిల్ 30 : ఏదులాపురం మున్సిపాలిటీ కమిషనర్‌గా ఆళ్ల శ్రీనివాస్ రెడ్డి నియామకం అయ్యారు. ఇందుకు సంబంధించి గురువారం తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మున్సిపాలిటీ ఎన్నికల ముందు ఈఎంసీ కమిషనర్‌గా విధులు నిర్వహించిన ఆళ్ల శ్రీనివాస్‌రెడ్డి నల్లగొండ జిల్లా హాలియా మున్సిపాలిటీకి బదిలీ అయిన సంగతి తెలిసిందే. ఆయన స్థానంలో తిరుమలగిరి మున్సిపల్ కమిషనర్ అలీ ని ఏదులాపురం మున్సిపల్ కమిషనర్ గా బదిలీ అయ్యారు. అయితే తిరిగి మున్వర్ అలీ స్థానంలో ఆళ్ల శ్రీనివాస్ రెడ్డిని నియమించారు. మున్సిపాలిటీ ఏర్పాటు కాకముందు పెద్దతండా గ్రామ పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ గా మున్సిపల్ ఆవిర్భావం తర్వాత తొలి కమిషనర్‌గా ఆళ్ల శ్రీనివాస్ రెడ్డి వీధిలో నిర్వహించిన సంగతి తెలిసింది. తిరిగి ఇదే మున్సిపాలిటీ కమిషనర్ గా శ్రీనివాస్ రెడ్డికి బాధ్యతలు విశేషం.