బోనకల్లు, అక్టోబర్ 3 : టీజీపీఎస్సీ ఇటీవల వెల్లడించిన గ్రూప్-1 ఫలితాల్లో డీఎస్పీ ఉద్యోగానికి ఎంపికైన పాపినేని అఖిల్‌ను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఖమ్మం ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధుసూదన్ రావు ఘనంగా సన్మానించారు. గురువారం రాత్రి ఖమ్మంలోని స్వర్ణ భారతి కల్యాణ మండపంలో గ్రూప్ -1 ఫలితాల్లో రాణించి ఉద్యోగాలను సాధించిన వారికి సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని తూటికుంట గ్రామానికి చెందిన పాపినేని అఖిల్ ను శాలువాతో సత్కరించి, ఆయన తల్లిదండ్రులైన శ్రీనివాసరావు, జ్యోతిని అభినందించి మెమొంటోను అందజేశారు. ఈ కార్యక్రమంలో మధిర మాజీ ఎమ్మెల్యే కొండబాల కోటేశ్వరరావు, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ పాల్గొన్నారు.