వ్యవసాయానుబంధ రంగాలతో ఉపాధి
వ్యవసాయ అనుబంధ రంగాలతో మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వ్యవసాయ కళాశాల అసోషియేట్ డీన్ డాక్టర్ జే.హేమంత్‌కుమార్ స్పష్టం చేశారు. మహిళలను పారిశ్రామికవేత్తలుగా ప్రోత్సహించేందుకు ప్రభుత్వాలు ప్రాధాన్యమిస్తున్నాయని అన్నారు.
- వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ హేమంత్‌కుమార్
అశ్వారావుపేట, మార్చి 15: వ్యవసాయ అనుబంధ రంగాలతో మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వ్యవసాయ కళాశాల అసోషియేట్ డీన్ డాక్టర్ జే.హేమంత్‌కుమార్ స్పష్టం చేశారు. మహిళలను పారిశ్రామికవేత్తలుగా ప్రోత్సహించేందుకు ప్రభుత్వాలు ప్రాధాన్యమిస్తున్నాయని అన్నారు. స్థానిక వ్యవసాయ కళాశాలను సందర్శించిన ములకలపల్లి మండలానికి చెందిన మహిళా రైతులతో శుక్రవారం ఆయన మాట్లాడారు.
పుట్టగొడుగుల పెంపకం, వానపాముల ఎరువు, జీవన ఎరువుల తయారీ ద్వారా మహిళా రైతులు నికర ఆదాయం పొందవచ్చని వివరించారు. కుటీర పరిశ్రమల ఏర్పాటు స్వయం ఉపాధికి దోహదపడుతుందని అన్నారు. ఇందుకు ప్రభుత్వం సబ్పిడీ పధకాలను కూడా అందిస్తున్నట్లు చెప్పారు. అనంతరం పుట్టగొడుగుల పెంపకంపై డాక్టర్ శ్రీలత, వానపాముల ఎరువుల తయారీపై డాక్టర్ పావని, జీవన ఎరువుల తయారీపై డాక్టర్ పీ.రెడ్డిప్రియ మహిళా రైతులకు శిక్షణ ఇచ్చారు. కళాశాల శాస్త్రవేత్తలు డాక్టర్ జీ.గోపాలకృష్ణమూర్తి, డాక్టర్ దీపక్‌రెడ్డి పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

