కారేపల్లి: గణేష్ మండపాల వద్ద విద్యుత్ ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలని కారేపల్లి (Karepally) ట్రాన్స్‌కో ఏఈ కర్నాటి సుధాకర్ రెడ్డి (AE Sudhakar Reddy) నిర్వాహకులకు సూచించారు. మంగళవారం కారేపల్లి క్రాస్‌రోడ్‌లోని సబ్ స్టేషన్లో ఏఈ విలేకరులతో మాట్లాడుతూ.. విద్యుత్ లైన్ల కింద, ట్రాన్స్ఫార్మర్ల దగ్గర మండపాల ఏర్పాటు చేయవద్దని కోరారు. మండపాల్లో వైరింగ్, లైటింగ్ వంటి పనులను లైసెన్స్ పొందిన ఎలక్ట్రీషియన్‌తో చేయించుకోవాలని ఆయన సూచించారు.
వినాయక మండపాల వద్ద వైరింగ్‌లో జాయింట్లు లేకుండా జాగ్రత్త పడాలని ఏఈ తెలిపారు. కరెంట్ స్తంభాలకు ‘హుక్కింగ్’ వేసి విద్యుత్‌ను వాడుకోవడం ప్రమాదకరమని సుధాకర్ రెడ్డి హెచ్చరించారు. మండపాల వద్ద ఎర్తింగ్‌తో త్రీ పిన్ ప్లగ్‌లను ఉపయోగించాలని, సర్వీస్ వైర్‌ను స్తంభానికి బిగించిన తర్వాత సంబంధిత ప్రాంతంలోని లైన్‌మెన్‌కి తెలియజేయకుండా ఎటువంటి మార్పులు చేయవద్దని ఆయన మండప నిర్వాహకులకు తెలియజేశారు.
ఇన్వర్టర్, జనరేటర్ వంటివి వినియోగించేవాళ్లు.. రిటర్న్ కరెంట్ వెళ్లకుండా సరైన జాగ్రత్తలు తీసుకోవాలని ఏఈ కోరారు. ప్రజలందరూ భక్తి శ్రద్ధలతో వినాయక చవితిని ఘనంగా జరుపుకోవాలని.. ఎలాంటి ప్రమాదాల బారిన పడకుండా అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఏఈ సూచించారు.