కారేపల్లి : ఆకాల వర్షాలతో నష్టపోయిన దెబ్బతిన్న పంట పొలాలను వ్యవసాయాధికారులు సర్వే చేయనున్నారు. మంగళవారం నుండి పంట నష్టంపై వ్యవసాయ విస్తరణాధికారులు క్షేత్రస్ధాయిలో పరిశీలన చేస్తున్నట్లు వ్యవసాయాధికారి బీ.అశోక్‌కుమార్ (AE Ashok Kumar) తెలిపారు. వర్షాలతో కొట్టుక పోయిన, ఇసుక మేట వేసిన, కుళ్లి పోయిన పంటలను ఏఈవోలు పరిశీలిస్తారు. రైతుల పేర్లు, ఎంత నష్టం జరిగింది? అనే వివరాలు నమోదు చేస్తారన్నారు. దెబ్బతిన్న రైతులు తమ పరిధిలోని ఏఈవో దృష్టి నష్టం వివరాలను తీసుకవెళ్ళాలని ఆయన కోరారు.
సింగరేణి క్లస్టర్ పరిధిలో సింగరేణి, పేరుపల్లి రైతులు ఏఈవో మున్ని ఫోన్ నంబర్ 9281037129, గేటుకారేపల్లి క్లస్టర్ పరిధిలో గేటుకారేపల్లి, మాధారం, కమలాపురం రెవిన్య గ్రామాలకు చెందిన వారు ఏఈవో చంద్రకళ ఫోన్ నంబర్ 9281037126 కు కాల్ చేయాలి. మాణిక్యారం క్లస్టర్ పరిధిలోని మాణిక్యారం, రేలకాయలపల్లి, బాజుమల్లాయిగూడెం రెవిన్యూ గ్రామాల రైతులు ఏఈవో నరేష్ ఫోన్ నంబర్ 9281037128, కోమట్లగూడెం క్లస్టర్ పరిధిలోని కోమట్లగూడెం, విశ్వనాధపల్లి రైతులు ఏఈవో మహేష్ ఫోన్ నంబర్ 9281037127, ఉసిరికాయలపల్లి క్లస్టర్‌లోని ఉసిరికాయలపల్లి రెవిన్యూ గ్రామ రైతులు ఏఈవో ప్రమీల ఫోన్ నంబర్ 9281037130 లను సంపద్రించి పంట నష్టం నమోదు చేయించుకోవాలని ఏవో కోరారు.