కారేపల్లి,జనవరి 4 : తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాలలో 2026-27 విద్యా సంవత్సరానికి గాను 5నుండి 9వ తరగతి వరకు ఉమ్మడి ప్రవేశ పరీక్షకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని సింగరేణి మండల గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల/కళాశాల ప్రిన్సిపాల్ జి. హరికృష్ణ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. గిరిజన గురుకుల పాఠశాలలో 5వతరగతి,6వ తరగతి నుండి 9వ తరగతి వరకు ప్రవేశం పొందుటకు ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు ఈనెల 21 వరకు ఆన్లైన్ రూ.100 రుసుము చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.
దరఖాస్తు చేయడానికి అభ్యర్థి రెండు పాస్ ఫొటోలు, అభ్యర్థి సంతకం, ఆధార్ కార్డు, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రం, దివ్యాంగులయితే సంబంధిత సర్టిఫికెట్ జిరాక్స్ లతోపాటు మొబైల్ నెంబర్ ను తప్పనిసరిగా పొందుపరచాలని పేర్కొన్నారు. పాఠశాలలో ప్రవేశం పొందుటకు కావాల్సిన పూర్తి సమాచారం కోసం స్థానిక గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయలో సంప్రదించాలని కోరారు. ఈ అవకాశాన్ని అర్హత కలిగిన విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.