చండ్రుగొండ, ఫిబ్రవరి 16: రెండేండ్ల క్రితం తెలంగాణ ఉద్యమ సారధి కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా నాటిన పనస మొక్కకు నేడు పనస పండ్లతో కలకలలాడుతోంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం, రేపల్లెవాడ గ్రామ వాసి- చండ్రుగొండ మండల బీఆర్ఎస్ పార్టీ ఉపాధ్యక్షులు సత్తి నాగేశ్వరరావు తన ఇంటి ఎదురుగా రెండేండ్ల క్రితం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా పనస మొక్కలు నాటాడు. ప్రస్తుతం పనస పండ్లతో కలకలలాడుతుండడంతో ఆదివారం గ్రామస్తులు సత్తి నాగేశ్వరావు ఇంటికి చేరుకొని నాటి కేసీఆర్ పరిపాలన బాగుందని కొనియాడారు. పనస మొక్కను నాటిన సత్యనారాయణను పలువురు అభినందించారు.