మధిర, మే 21 : ఆడ పిల్లలు ఉన్న ఇల్లు సంతోషాల హరివిల్లు అని, కుటుంబంలో అమ్మాయి పుడితే పండుగ చేసుకోవాలని మండల స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాసరావు అన్నారు. మధిర మున్సిపాలిటీ పరిధిలో గల మడుపల్లిలో బుధవారం మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మా ఇంటి మణిదీపం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చింతల సైదులు-కోకిల దంపతులకు కుమార్తె జన్మించిన సందర్భాన్ని పురస్కరించుకుని శ్రీనివాసరావు వారి ఇంటికి వెళ్లి మిఠాయి, స్వీట్ బాక్స్, పండ్లు అందజేశారు. చిన్నారికి నూతన దుస్తులు అందించి తల్లిదండ్రులను సత్కరించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అమ్మాయి జన్మిస్తే ఇంటిల్లిపాది పండుగ చేసుకోవాలన్నారు. ఆడపిల్ల పుట్టటం అదృష్టమని, ఇంట్లో పుట్టిన ఆడపిల్లను మగ పిల్లవాడితో సమానంగా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల అభివృద్ధి అధికారి వెంకటేశ్వర్లు, మున్సిపాలిటీ కమిషనర్ సంపత్ కుమార్, వార్డు ఆఫీసర్ కె.సతీశ్, ఐసీడీఎస్ సూపర్వైజర్లు కె.జ్యోతి కుమారి, టి.సుజాత కుమారి, పి.అన్నపూర్ణ, సత్యవతి అంగన్వాడీ టీచర్లు బి.రాధామాణిక్యం, సీహెచ్.మేరి కుమారి, సీహెచ్ శివ కుమారీ, అంగన్వాడీ హెల్పర్ బి.అరుణ, ఏఎన్ఎం సీహెచ్.సునీల రాణి, హెల్త్ అసిస్టెంట్ ఎస్.నాగేశ్వరావు, ఆశా కార్యకర్త ఎం.నిర్మల, వై.సునీత, స్టాప్ నర్స్ బి.వెంకటలక్ష్మి పాల్గొన్నారు.