గురువారం 09 ఏప్రిల్ 2020
Khammam - Jan 12, 2020 , 02:25:28

పల్లె ప్రగతిలో ఎస్సీ అభివృద్ధి శాఖ డీడీ శ్రమదానం

పల్లె ప్రగతిలో ఎస్సీ అభివృద్ధి శాఖ డీడీ శ్రమదానం


వైరా రూరల్‌, జనవరి 11: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న రెండో విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా వైరా మండలంలోని గరికపాడు గ్రామంలో ‘నేనున్నా’ మహిళా మండలి వెల్ఫేర్‌ సొసైటీ ఆధ్వర్యంలో శ్రమదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సోషల్‌ వెల్ఫేర్‌ డీడీ కస్తాల సత్యనారాయణ, వైరా ఎంపీడీవో రామ్మోహన్‌రావు హాజరై శ్రమదానం చేశారు. గ్రామంలోని రోడ్లను ఊడ్చి శుభ్రపరిచారు. హరితహారంలో భాగంగా రోడ్ల వెంట నాటిన మొక్కలకు కంచెను ఏర్పాటు చేశారు. పాఠశాలలోని ఆవరణను శుభ్రపరిచారు. అనంతరం గ్రామంలో ప్రజలను చైతన్య పరుస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సోషల్‌ వెల్ఫేర్‌ డీడీ సత్యనారాయణ మాట్లాడుతూ పల్లె ప్రగతి కార్యక్రమంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. మహిళా మండలి వెల్ఫేర్‌ సొసైటీ ఆధ్వర్యంలో శ్రమదానం నిర్వహించడం అభినందనీయమన్నారు. సర్పంచ్‌ కోటా ఏలీశా, కార్యదర్శి తేళ్ళపుట్ట రాధాక్రిష్ణ, మహిళా మండలి వెల్ఫేర్‌ సొసైటీ అధ్యక్షురాలు మేరుగు మానస, బాధ్యులు రూతు, బొల్లెపోగు త్రివేణి, ఎం.మౌనిక, మేరుగు రత్నంరాజు, మాతంగి రాంబాబు, బొల్లెపోగు శ్రీనివాసరావు, మాతంగి ప్రవీణ్‌, కోటా రాము, మాతంగి భూషణం తదితరులు పాల్గొన్నారు.


logo