న్యూఢిల్లీ : Serbiaలో జరిగిన గోల్డెన్ గ్లవ్ యూత్ బాక్సింగ్ చాంపియన్షిప్లో భారత బాక్సర్లు మొత్తంగా 19 పతకాలు సాధించారు. పోటీలకు చివరి రోజైన సోమవారం పది స్వర్ణాలు దక్కాయి. మహిళల విభాగంలో పాల్గొన్న 12మందికి పతకాలు దక్కడం విశేషం. భావన శర్మ, దేవిక ఘోర్పడె, కుంజురాణి దేవి, రవీనా, కృతి స్వర్ణాలు దక్కించుకోగా, ముస్కాన్, ప్రాంజల్ యాదవ్ రజతాలు, కాషిశ్, నీరూ, ఆర్య, ప్రియాంక, లాషు కాంస్యాలు గెలిచారు. పురుషుల విభాగంలో విశ్వనాథ్, ఆశిష్, సాహిల్, జాదుమణి, భరత్ స్వర్ణాలు, నిఖిల్, దీపక్ కాంస్య పతకాలు దక్కించుకున్నారు. జాదుమణి ‘బెస్ట్ ఫైటర్ ఆఫ్ ది టోర్నమెంట్’, రవీనా ‘బెస్ట్ బాక్సర్’ అవార్డులు గెలుచుకున్నారు.