
నగరంలో 39 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీ
ద్విచక్రవాహనంపై వెళ్లి చీర, పసుపు, కుంకుమ అందించిన మంత్రి అజయ్
లబ్ధిదారుల్లో వెల్లివిరిసిన ఆనందం
ఖమ్మం, ఆగస్టు 11;రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ఏ కార్యక్రమం తలపెట్టినా.. ప్రజల చెంతకే వెళ్తారు. సహజంగా నాయకులు ప్రజలను తమ చుట్టూ తిప్పించుకుంటారు. కానీ ఆయన మాత్రం ప్రజల వద్దకే వెళ్తారు. నేరుగా లబ్ధిదారులను కలుస్తారు. వారికి సాయం చేస్తారు. మరోసారి మంత్రి అజయ్ లబ్ధిదారుల చెంతకు వెళ్లి కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. బుధవారం ఖమ్మం నగరంలో 39 మంది లబ్ధిదారుల ఇండ్ల వద్దకు వెళ్లి చెక్కులతోపాటు చీర, పసుపు, కుంకుమను అందజేశారు. ద్విచక్ర వాహనంపై గల్లీగల్లీ తిరిగి ప్రజల యోగక్షేమాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి పేద కుటుంబానికి ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దన్నలా నిలుస్తున్నారని, వారి కన్నీళ్లు తుడిచేందుకు అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు.
కామేపల్లి, ఆగస్టు 11: ఎదిగిన పేద, మధ్య తరగతి కుటుంబాల్లోని ఆడ పిల్లల వివాహాలకు కల్యాణలక్ష్మి పథకం భరోసాను ఇస్తున్నదని ఇల్లెందు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియానాయక్ పేర్కొన్నారు. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 71 మంది లబ్ధిదారులకు రూ.71.59 లక్షల విలువైన కల్యాణలక్ష్మి చెక్కులను బుధవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మి పథకం పేద, మధ్య తరగతి కుటుంబాలకు వరంలా మారిందన్నారు.
గదుల నిర్మాణానికి శంకుస్థాపన
మండలంలోని ముచ్చర్ల – జాస్తిపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో రూ.40 లక్షలతో నిర్మించనున్న అదనపు గదుల నిర్మాణ పనులను ఎమ్మెల్యే హరిప్రియానాయక్ ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఎంపీపీ బానోత్ సునీత, జడ్పీటీసీ బానోత్ వెంకటప్రవీణ్‌కుమార్, సొసైటీ అధ్యక్షుడు ధనియాకుల హనుమంతరావు, తీర్థాల చిదంబరరావు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఆంతోటి అచ్చయ్య, ఉపాధ్యక్షుడు మల్లెంపాటి శ్రీనివాసరావు, సర్పంచు మిక్కిలి కళావతి, జాటోత్ లూసీ, అజ్మీరా రాందాస్‌నాయక్, ఎంపీటీసీ మల్లెంపాటి నర్సింహారావు, కీసర మంజుల, లకావత్ సునీత, రాంరెడ్డి జగన్నాథరెడ్డి, తహసీల్దార్ దారా ప్రసాద్, ఎంపీడీవో సిలార్‌సాహెబ్, విద్యా కమిటీ చైర్మన్ శైలజ, రామకృష్ణ, టీఆర్ఎస్ నేతలు వడియాల కృష్ణారెడ్డి, పుచ్చకాయల సత్యనారయణ, బానోత్ రాందాస్‌నాయక్ పాల్గొన్నారు.