
ఖమ్మం, సెప్టెంబర్ 7: అభివృద్ధి, సంక్షేమ పథకాలతోనే టీఆర్ఎస్కు ఆదరణ లభిస్తోందని, వాటికి ఆకర్షితులయ్యే అన్ని పార్టీల నుంచీ టీఆర్ఎస్లోకి వస్తున్నారని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పేర్కొన్నారు. కాంగ్రెస్, బీజేపీ, సీపీఎంలకు చెందిన సుమారు 400 మంది నాయకులు, కార్యకర్తలు మంగళవారం టీఆర్ఎస్లో చేరారు. ఖమ్మం నగరంలోని టీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో వీరందరికీ మంత్రి అజయ్‌కుమార్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి అజయ్ మాట్లాడుతూ.. టీఆర్ఎస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలకూ పథకాలు అందుతున్నాయని అన్నారు. బీజేపీ నుంచి లక్ష్మణ్, వెంకటాచారి, సీపీఎం నుంచి గడ్డం రమేశ్, కాంగ్రెస్ నుంచి 58వ డివిజన్ నుంచి పోటీ చేసిన పబ్బా చంద్రిక, తంగిరాల శ్రీకాంత్, తంగిరాల స్పందనతోపాటు 400 మంది టీఆర్ఎస్లో చేరారు. తొలుత భారీ ర్యాలీ నిర్వహించారు. టీఆర్ఎస్ నగర అధ్యక్షుడు కమర్తపు మురళి, కేఎంసీ మేయర్ నీరజ, టీఆర్ఎస్ జిల్లా కార్యాలయ ఇన్చార్జి ఆర్జేసీ కృష్ణ, సుడా చైర్మన్ బచ్చు విజయ్‌కుమార్, కార్పొరేటర్లు దోరేపల్లి శ్వేత, దండా జ్యోతిరెడ్డి, నాయకులు పరీద్ఖాద్రీక్, ఇస్సాక్, ప్రసన్నకృష్ణ, తాజుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.