
‘ఇంతింతై వటుడింతై’ అన్నట్లుగా ఖమ్మం జిల్లా ఎదిగింది. మరింత ఆధునికతను అందిపుచ్చుకుంటూ దూసుకెళ్తోంది. ఖమ్మం నగరమైతే ఆనవాళ్లకూ అందనంతగా అభివృద్ధి చెందింది. పూర్వ కాలంలో అభయారణ్యంగా ఉన్న ఖమ్మం గ్రామం.. నేడు జిల్లా కేంద్రంగా రూపాంతరం చెందింది. స్వరాష్ట్రంలో ప్రత్యేక గుర్తింపు పొందింది. 67 ఏళ్లలో జరగని అభివృద్ధి కేవలం ఏడేళ్లలో జరిగింది. సుందర నగరంగా పేరుగాంచింది. అన్ని రంగాల్లోనూ హైదరాబాద్ తర్వాతి స్థానాన్ని సొంతం చేసుకుంది. ఆహ్లాదకరమైన పార్కులు, మౌలిక వసతులు, కీడ్రా ప్రాంగణాలు, లకారం అందాలు, సెంట్రల్ లైటింగ్.. ఇలా చెప్పుకుంటూపోతే అనేక విలాసవంతమైన సౌకర్యాలు. విద్యా వైద్యం రంగాల్లో తిరుగులేని పురోగతి. ఏడు దశాబ్దాలకు చేరువలో ఉన్న స్తంభాద్రి జిల్లా చరిత్ర, ఆవిర్భావం గురించి ప్రత్యేక కథనం. -ఖమ్మం వ్యవసాయం, సెప్టెంబర్ 30
ఆవిర్భావానికి ముందు ఇలా..
అప్పటి ఓరుగల్లు నుంచి విడిపోయి 1953 అక్టోబర్ 1న ప్రత్యేక జిల్లాగా ఏర్పడింది ఖమ్మం. స్తంభం నుంచి స్తంభాద్రిగా, ఆ తరువాత ఖంభంమెట్టు, తదనంతరం ఖమ్మంగా పిలుచుకుంటున్నాం. ఖమ్మం జిల్లాతోపాటు నగరం కూడా భౌగోళికంగా ఎంతో మార్పుచెందుతూ వచ్చింది. బుర్హాన్‌పురం చెరువు, తలారొడి చెరువు, లక్నొవరం చెరువులే వ్యవసాయ పంటలకు ప్రధాన ఆధారంగా ఉండేవి. నాటి నిజాం నవాబుల అడ్డాగా ఉండేదని, వారు తరచూ వచ్చి వెళ్తుండేవారని చరిత్ర చెబుతోంది. సముద్రమట్టానికి 315 అడుగల ఎత్తులో కృష్ణా, గోదావరి నదుల మధ్యలో అనేక పర్యతాలు, ఎత్తయిన రాతికొండల నడుమ చిన్న చిన్న పల్లెల సముహంగా ఉండేది.
నిలకడగా గోదావరి
భద్రాచలం/పర్ణశాల/దుమ్ముగూడెం, సెప్టెంబర్30: భద్రాచలం వద్ద గోదావరి ఉధృతి నిలకడగానే ఉంది. గురువారం ఉదయం 7గంటలకు గోదావరి నీటిమట్టం 43అడుగులకు చేరడంతో కలెక్టర్ అనుదీప్ మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. గత రెండు నెలల్లో మూడోసారి భద్రాచలం వద్ద మెదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ఉదయం 8గంటలకు 43.90అడుగులు ఉన్న గోదావరి ఉధృతి మధ్యాహ్నం 2గంటల వరకు 43.90 వద్ద నిలకడగా ఉంది. మధ్యాహ్నం 3గంటలకు 43.70అడుగులు ఉన్న గోదావరి 4గంటలకు 43.60గా నమోదయింది. రాత్రి 7గంటలకు 43.4అడుగులుగా ఉంది. భద్రాచలం వద్ద గోదావరి క్రమక్రమంగా తగ్గుతుందని, వరద ప్రమాదం ఏమీ లేదని కేంద్ర జల వనరుల సంఘం అధికారులు తెలిపారు. మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. రాత్రి 10గంటలకు మొదటి ప్రమాద హెచ్చరికను ఉపసంహరించే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. అయితే పర్ణశాల, దుమ్ముగూడెం వద్ద ఇంకా గోదావరి ఉధృతి కొనసాగుతూనే ఉంది. పర్ణశాల సీతవాగు వరద పెరగడంతో నారచీరెల ప్రాంతం పూర్తిగా మునిగింది. దీంతోభక్తులు పర్ణశాల రాముడిని దర్శించుకోకుండానే వెనుదిరిగిపోతున్నారు. నదిలోకి ఎవరినీ వెళ్లనీయకుండా అధికారులు చర్యలు చేపట్టారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో తాలిపేరు ప్రాజెక్టు గేట్ల నుంచి వరద భారీగా గోదావరిలోకలుస్తున్నది. దీంతో దుమ్ముగూడెం గోదావరి వద్ద క్రమంగా నీటిమట్టం పెరుగుతున్నది. గురువారం సాయంత్రానికి21.5 అడుగులకు చేరగా రాత్రికి గోదావరి ఉధృతి నిలకడగా ఉండొచ్చని సెక్టోరియల్ అధికారులు తెలిపారు.
స్వరాష్ట్రంలో పురోభివృద్ధి..
ఖమ్మం జిల్లా అభివృద్ధి గురించి చెప్పుకోవాల్సి వస్తే.. తెలంగాణ ఆవిర్భావానికి ముందు, ఆ తరువాత అని మాత్రమే చర్చించుకోవాలి. స్వరాష్ట్రంలో గణనీయమైన అభివృద్ధి సాధించింది ఖమ్మం జిల్లా. గ్రానెట్ పరిశ్రమ ఖ్యాతి విశ్వవ్యాప్తమైంది. వస్త్ర వ్యాపారం విస్తృతమైంది. సెంట్రల్ లైటింగ్‌తో కూడిన విశాలమైన రోడ్లు అభివృద్ధికి అద్దంలా నిలుస్తున్నాయి. లకారం ట్యాంక్‌బండ్, ఐటీ హబ్ ప్రత్యేకను చాటుతున్నాయి. అంతేగాక, పారిశ్రామిక, వాణిజ్య రంగాల్లో అగ్రగామిగా ఉన్న ఖమ్మం జిల్లా ఉపాధి కేంద్రంగా విరాజిల్లుతోంది.
విద్య, వైద్య రంగాల్లో ప్రముఖ స్థానం..
విద్య, వైద్య రంగాల్లో ప్రముఖ స్థానాన్ని సొంతం చేసుకున్నది ఖమ్మం జిల్లా. కార్పొరేట్ విద్యాసంస్థలు కేజీ నుంచి పీజీ దాకా నాణ్యమైన విద్యను అందిస్తున్నాయి. ప్రత్యేకంగా ఉన్నత ప్రమాణాలతో కూడిన సాంకేతిక విద్య స్థానికంగానే లభ్యమవుతోంది. ఇక వైద్య రంగంలో అత్యాధునిక సేవలు అందుతున్నాయి. టెక్నాలజీ సాయంతో ఎంతటి క్లిష్టమైన శస్త్ర చికిత్సలనైనా అందించగల నిపుణులైన వైద్యులకు కూడా ఖమ్మమే తలమానికంగా నిలుస్తోంది.