Road accident | కరీనంగర్ జిల్లాలో విషాదం.. కారు ఢీ కొని యువకుడి మృతి
రాజీవ్ రహదారి దాటుతున్న యువకున్ని కారు అతివేగంగా ఢీకొట్టగా అక్కడిక్కడే మృతి చెందాడు.
తిమ్మాపూర్, అక్టోబర్ 14 : రాజీవ్ రహదారి దాటుతున్న యువకున్ని కారు అతివేగంగా ఢీకొట్టగా అక్కడిక్కడే మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం అల్గునుర్ డివిజన్ కు చెందిన వీర్ల సదాలింగం అనే యువకుడు బుధవారం ఉదయం అల్గునుర్ చౌరస్తా సమీపంలో హైదరాబాద్ రోడ్డు వైపు దాటుతున్నాడు. ఈ క్రమంలో కరీంనగర్ వెళ్తున్న కారు ఢీ కొట్టడంతో రోడ్డుపై ఎగిరిపడి తలకు తీవ్రమైన గాయాలై అక్కడిక్కడే మృతి చెందాడు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ప్రభుత్వ దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. కాగా, కుటుంబసభ్యులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహంపై రోదించిన తీరు అందరినీ కలిచివేసింది. గ్రామంలో సౌమ్యునిగా పేరున్న ఆయన మరణించడంతో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Road accident | కరీనంగర్ జిల్లాలో విషాదం.. కారు ఢీ కొని యువకుడి మృతి
Health tips | లేవగానే బ్రష్ చేయకుండానే నీళ్లు తాగుతున్నారా.. అయితే ఈ విషయం తెలుసుకోవాల్సిందే..!
Regina | ప్రేమలో దారుణంగా మోసపోయా,డిప్రెషన్లోకి వెళ్లా.. జీవితంలోని చేదు అనుభవాన్ని బయటపెట్టిన రెజీనా!
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Ranabaali | ‘రణబాలి’ ఓటీటీ విడుదల తేదీ ఖరారు.. ఆ తేదీ నుంచే విజయ్ దేవరకొండ సినిమా స్ట్రీమింగ్!
ట్రెండింగ్ వార్తలు
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video

