Nandimedaram | ధర్మారం, సెప్టెంబర్ 19 : పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారం గ్రామానికి చెందిన లింగాల వర్షిత (19) అనే యువతి ఎయిర్ హోస్టెస్ శిక్షణ కోసం ఎంపికైంది. ఆ గ్రామానికి చెందిన లింగాల సుస్మిత- తిరుపతి దంపతులకు కొడుకు ,కూతురు సంతానం ఉన్నారు. వీరిలో కొడుకు బీటెక్ సెకండ్ ఇయర్ వరంగల్ లో చదువుతున్నాడు. కుమార్తె వర్షిత 5వ తరగతి నుంచి పదవ తరగతి వరదాకా నంది మేడారంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ శాఖ బాలికల గురుకుల విద్యాలయంలో చదివింది. ఆ తర్వాత ఇంటర్ సీఈసీ సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి బాలికల గురుకుల విద్యాలయంలో 2025-26 లో చదివింది. అనంతరం ఆమె సిఏ కోచింగ్ కోసం సన్నద్ధమవుతుంది.
కాగా ఇంటర్ సెకండ్ ఇయర్ గర్రెపల్లి లోని గురుకుల విద్యాలయంలో చదువుతుండగానే ఆ విద్యాలయ అధ్యాపకుల ప్రోత్సాహంతో వర్షిత ఎయిర్ హోస్టెస్ కోసం ప్రోత్సహించారు. దీంతో 2025 లొనే కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని ఎయిర్ లైన్స్ అధికారిక వెబ్సైట్ కేబిన్ కృవ్ లో వర్షిత దరఖాస్తు చేసుకుంది. అనంతరం ఆన్లైన్లో ఎగ్జామ్ రాసింది. అనంతరం ఈనెల 2న ఫలితాలు వెల్లడి కాగా వర్షిత ఎయిర్ హోస్టేస్ శిక్షణ కోసం ఎంపికైనట్లు ఆమెకు సమాచారం వచ్చినట్లు తల్లిదండ్రులు తెలిపారు. దీంతో తమ కూతురు ఎయిర్ హోస్టేస్ శిక్షణ కోసం ఎంపిక కావడం పట్ల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. కాగా ఎయిర్ లైన్స్ వారి పిలుపుమేరకు శిక్షణ పొందడానికి సదరు యువతీ వర్షిత ఈ మేరకు హైదరాబాద్ లోని ముసరాబాద్ లోని పౌర విమానయాన శాఖ శిక్షణ కేంద్రానికి వెళ్లింది. ఈ సందర్భంగా వర్షితను ఆమె తల్లిదండ్రులు సుస్మిత తిరుపతి తో పాటు పలువురు అభినందించారు.