Sircilla protest | సిరిసిల్ల రూరల్, జూలై 3: రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లిలోని తెలంగాణ గిరిజన సంక్షేమ మహిళ సంక్షేమ డిగ్రీ, ఫైన్ ఆర్ట్స్ విద్యార్థులు రెండోరోజు ఆందోళన చేపట్టారు. తమ సమస్యలు పరిష్కరిచాలంటూ రెండు రోజులు నిరసనలు చేస్తున్నారు. తంగళ్లపల్లి మండల కేంద్రంలోని సిరిసిల్ల-సిద్దిపేట బుధవారం బైఠాయించి ధర్నా చేసిన విషయం తెలిసిందే.
తహసీల్దార్ జయంత్, ఎస్ఐ ఉపేంద్రచారి, ప్రిన్సిపల్ తో పాటు అధికారులు ఉన్నత అధికారులు వచ్చి, మీ సమస్య పరిష్కరిస్తారని శాంతింపచేసిన విషయం తెలిసిందే. తమ కళాశాలకు కలెక్టర్, ఉన్నత అధికారులు ఎవరూ గురువారం రాలేదని, కళాశాల సమయం ముగిశాక సాయంత్రం వేళలో ప్లకార్డులతో కళాశాలలో నిరసన వ్యక్తం చేశారు.
తమకు మెటీరియల్స్ తోపాటు పూర్థి స్థాయి ప్యాకల్టీ కేటాయించాలని డిమాండ్ చేశారు. మూడు నెలలుగా మెటీరియల్స్ రావడం లేదని వాపోయారు. ప్యాకల్టీలో ఇద్దరు మానేశారని, ఉన్నవారికి వేతనాలు నాలుగు నెలలుగా రావడం లేదని పేర్కొన్నారు. తమకు వచ్చే నెలలో ప్రాక్టికల్స్ ఉన్నాయని, ఎలా పరీక్షలు రాయాలని ప్రశ్నించారు.
కళాశాలలో ఆందోళన చేస్తున్న విద్యార్థులను ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్ శాంతింపజేసి, తమ సమస్యను తామే కలెక్టర్ కార్యాలయంకు వెళ్లి వివరిస్తామని, అప్పటి వరకు శాంతించాలని పేర్కొనగా, మీరు కలెక్టర్ ను కలిసి వచ్చే వరకు నిరసన చేస్తామని పేర్కొనడం గమనార్హం. దీంతో ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్, పలువురు అధ్యాపకులు కలెక్టర్ కార్యాలయానికి తరళి వెళ్లారు.