MLA Chinthakunta Vijayaramana Rao | పెద్దపల్లి, జూన్24 : ప్రజా సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. ప్రజాపాలనలో భాగంగా కొత్తగా మంజూరైన రేషన్ కార్డులను జిల్లా కేంద్రంలోని ఆర్కే గార్డెన్లో లబ్ధిదారులకు మంగళవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెద్దపల్లి మండలంలో నూతనంగా 1203 రేషన్ కార్డులు మంజూరు కాగా, లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులు అందించామని తెలిపారు.
అర్హులైన ప్రతీ ఒక్క కుటుంబానికి తెల్ల రేషన్ కార్డు వస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ ఈర్ల స్వరూప, పెద్దపల్లి తహసీల్దార్ దండిగ రాజయ్య, నాయకులు బండారి రామ్మూర్తి, నూగిళ్ల మల్లయ్య, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.