Dharmaram | ధర్మారం, జనవరి 14 : పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం కటికనపల్లి గ్రామంలో బుధవారం భోగి పండుగను పురస్కరించుకొని స్థానిక గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో మహిళలకు ముగ్గుల పోటీలను నిర్వహించారు. మహిళలు పెద్ద సంఖ్యలో వచ్చి ఈ పోటీలలో పాల్గొన్నారు. తీరొక్క ముగ్గులు అందరినీ అలరించాయి. కొత్తూరు గ్రామ సర్పంచ్ భూక్య సంగీత న్యాయ నిర్ణేతగా వ్యవహరించి మహిళలు ఆకర్షణీయంగా వేసిన ముగ్గులను ఎంపిక చేశారు.
అనంతరం విజేతలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను స్థానిక సర్పంచ్ చేపూరి లచ్చయ్య ప్రదానం చేశారు. ముగ్గుల పోటీలలో పాల్గొన్న మహిళలందరికీ కన్సోలేషన్ బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచి నోనగిరి అజయ్, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.