కమాన్‌చౌరస్తా, మార్చి 8: జిల్లా వ్యాప్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా, పలు సంఘాల ఆధ్వర్యంలో కేక్‌లు కట్ చేసి, మహిళా మణులను సన్మానించారు. నగరంలోని విద్యాసంస్థల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. అల్ఫోర్స్ విద్యాసంస్థల ఆధ్వర్యంలో వావిలాలపల్లి కేంద్ర కార్యాలయంలో వేడుకలకు చైర్మన్ నరేందర్ రెడ్డి హాజరై మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మహిళలకు పలు పోటీలు నిర్వహించారు. విజేతలకు బహుమతులు అందజేశారు. కరీంనగర్ ఫిలిం సొసైటీ ఆధ్వర్యంలో మహిళా విశిష్ట పురస్కారాలను గొట్టె కనకవ్వ, గుత్తా నాగదుర్గ, శ్రీదేవి రెడ్డికి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో మహేశ్వర్ పాల్గొని పురస్కార గ్రహీతలను సత్కరించారు. ఇక్కడ కఫిసొ అధ్యక్షుడు పొన్నం రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు. అలాగే, కరీంనగర్ ఫోక్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో కలెక్టర్ పమేలా సత్పతికి మహిళా శక్తిమాన్ పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఇక్కడ సంస్థ ప్రతినిధులు కృపాదానం, మాడిశెట్టి గోపాల్, గోపాల్ రావు ఉన్నారు.
కలెక్టరేట్, మార్చి 8: నగరంలోని పలు మహిళా సంఘాలు, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో ఉమెన్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. కోతిరాంపూర్‌లోని శ్రామిక మహిళా సంఘం, చాకలి అయిలమ్మ మహిళా సంక్షేమ సంఘం, ఏకలవ్య సంక్షేమ సంఘం, హనుమాన్‌నగర్‌లోని శ్రీమాత మహిళా సమాఖ్య, లక్ష్మీనగర్ రుద్రమదేవి మహిళా సంఘం, హౌసింగ్ బోర్డులోని ఇందిరా మహిళా సంక్షేమ సంఘాల ఆధ్వర్యంలో శనివారం ఆయా సంఘాల్లో వేడుకలు జరిపారు. ఈ సందర్భంగా పలు రంగాల్లో విశిష్ట సేవలందించిన మహిళలను ఆయా సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఆయా చోట్ల నిర్వహించిన కార్యక్రమాల్లో పట్టణ మహిళా సంఘాల సమాఖ్య అధ్యక్షురాలు బండి సుమ, పలువురు మాజీ మహిళా కార్పొరేటర్లు, ఆయా ప్రాంతాల నాయకులు, మహిళలు పాల్గొన్నారు.
విద్యానగర్, మార్చి 8 : లయన్స్ క్లబ్ గోల్డెన్ శాతవాహన ఆధ్వర్యంలో కొత్తపల్లి పోలీస్‌స్టేషన్‌లో మహిళా ఎస్సై స్వాతి, మహిళా కానిస్టేబుల్స్ దీపిక, జ్యోతి, విజయ, సౌజన్యను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షుడు మానువాడ శంకర్, క్లబ్ కార్యదర్శి కార్యదర్శి లయన్ ననువాల గిరిధర్‌రావు, సెకండ్ వైస్ ప్రెసిడెంట్ లయన్ చిలపూరి రాములు, థర్డ్ వైస్ ప్రెసిడెంట్ లయన్ మమత వేణు, డైరెక్టర్స్ లయన్ బడి మురళి, లయన్ చంద్రారెడ్డి, ఏఎస్ఐ పోచయ్య, హెడ్ కానిస్టేబుల్ శ్రీశైలం, కానిస్టేబుల్ ఖదీర్ తదితరులు పాల్గొన్నారు. శాతవాహన యూనివర్సిటీ సర్కిల్లోని సావిత్రిబాయి ఫూలే విగ్రహానికి సిద్ధార్థ వెల్ఫేర్ అధ్యక్షుడు నాగి అశోక్ పూలమాల వేసి నివాళులర్పించారు.
కార్యక్రమంలో సావిత్రిబాయి ఫూలే జిల్లా అధ్యక్షురాలు అస్తపురం తిరుమల, ఉపాధ్యక్షురాలు ముల్కల కవిత, ప్రధాన కార్యదర్శి అన్ని జ్యోతిరెడ్డి, కోశాధికారి కె. స్వాతి, ప్రసన్న, ఎం మమత పాల్గొన్నారు. కరీంనగర్లో ఐఎంఏ, మహిళా వైద్యుల అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహిళా దినోత్సవ వేడుకలను కలెక్టర్ పమేలా సత్పతి ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. మహిళా సాధికారత, సమానత్వంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రతి దవాఖానలో ఆరోగ్య మహిళా పోటీలు పెట్టాలని సూచించారు. శస్త్ర చికిత్సల రేటును తగ్గించాలన్నారు. వేడుకల్లో భాగంగా ఐఎంఏ హాల్ నుంచి తెలంగాణచౌక్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం తెలంగాణచౌక్‌లో ఫ్లాష్ డ్యాన్స్‌తో వైద్యులు ప్రజలకు మహిళల ప్రాధాన్యత గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్లు ఎనమల్ల నరేశ్, నవీన్‌కుమార్, సీనియర్ డాక్టర్లు, ఐఎంఏ స్టేట్ ప్రెసిడెంట్ (ఎలక్టెడ్) పి. కిషన్, విజయ్‌కుమార్, ఉమెన్ డాక్టర్స్ వింగ్ చైర్పర్సన్ మాధవి, కో చైర్పర్సన్ చైతన్యరెడ్డి, వైస్ ప్రెసిడెంట్ కవిత, శ్రీదేవి, ఝాన్సీ, హరిత, నవీన, గీత, శైష శైలజ, విద్య, తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణచౌక్, మార్చి 8: జిల్లాకేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో మహిళా దినోత్సవం సందర్భంగా ఆర్టీసీలో రెగ్యులర్‌గా ప్రయాణించే మహిళలతో పాటు ఉత్తమ సేవలందించిన సూపర్వైజర్స్, కండక్టర్లను ఆర్ఎం రాజు శాలువాలు కప్పి సన్మానించారు. కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు.
కొత్తపల్లి, మార్చి 8: జిల్లాలోని మహిళా వ్యాయామ ఉపాధ్యాయులను జిల్లా వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బాబు శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. జిల్లా కేంద్రంలోని డాక్టర్ బీఆర్ అంబేదర్ స్టేడియంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గంగాధర మండల ఎంఈవో ఏ ప్రభాకర్‌రావు, జీసీడీవో జగిత్యాల అనుపమ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి మాట్లాడారు. కార్యక్రమంలో కరీంనగర్ డీవైఎస్వో వీ శ్రీనివాస్ గౌడ్, పెద్దపల్లి డీవైఎస్వో ఎ. సురేశ్, జిల్లా ఎస్జీఎఫ్ కార్యదర్శి బి. వేణుగోపాల్, క్రీడా సంఘాల ప్రధాన కార్యదర్శులు వై మహేందర్‌రావు, ఎ. శంకరయ్య, కడారి రవి, కృష్ణారెడ్డి, డి. వీరన్న మాజీ ఎస్జీఎఫ్ కార్యదర్శులు ఆర్. నర్సయ్య, పి. శ్రీనివాస్ పాల్గొన్నారు.
కరీంనగర్ రూరల్, మార్చి 8: నగునూర్‌లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ మహిళా గురుకుల డిగ్రీ కళాశాలలో సమాజంలో మహిళలు సాధించిన విజయాలు, ఎదుర్కొనే సమస్యలు అధిగమించడంపై విద్యార్థినులు ప్రదర్శించిన స్కిట్స్ ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ టి. మాలతి. వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ జి. సమత, అధ్యాపకులు, తదితరులు పాల్గొన్నారు. నగునూర్‌లోని ఎస్పీఆర్ ఉన్నత పాఠశాలలో మహిళా శక్తి గొప్పతనాన్ని వివరిస్తూ విద్యార్థినీ విద్యార్థులు ఇచ్చిన సందేశం ఆహూతులను ఆలోచింపజేసింది. కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ డాక్టర్ ఎం విజయమోహన్ రెడ్డి, కరస్పాండెంట్ డాక్టర్ ఆర్ యాకయ్య, డైరెక్టర్లు డాక్టర్ పీఆర్ రాజేందర్, జి. ప్రశాంత్, కె. శ్యాంసుందర్, మేనేజింగ్ డైరెక్టర్ బి. ఉపేందర్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, కె చుక్కారెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ప్రభుత్వ మహిళా డిగ్రీ, పీజీ కళాశాలలో మహిళా సాధికారతపై నిర్వహించిన డిబెట్ ఆసక్తికరంగా సాగింది. కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ డి. వరలక్ష్మి, కో ఆర్డినేటర్, జీవ శాస్త్ర విభాగాధిపతి మనోజ్‌కుమార్, అధ్యాపకులు, విద్యార్థినులు పాల్గొన్నారు.
గంగాధర, మార్చి 8: మధురానగర్ చౌరస్తాలో మహిళా దినోత్సవ వేడుకలకు మారెట్ కమిటీ చైర్పర్సన్ జాగిరపు రజిత- శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో మహిళలు తోట సంధ్య, సముద్రల కవిత, అమడగోని భారతి, పుల్ల శ్వేత, శ్రీలత తదితరులు పాల్గొన్నారు.
మానకొండూర్ రూరల్, మార్చి 8: పచ్చునూర్ గ్రామంలో రొంటాల జమునా రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళా దినోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మహిళలను సన్మానించారు. పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. కార్యక్రమంలో తహసీల్దార్ బండి రాజేశ్వరి, ఎంపీడీవో వరలక్ష్మి, డాక్టర్ కవ్వంపల్లి అనురాధ, మాజీ ఎంపీపీ ముద్దసాని సులోచన, నాయకులు పాల్గొన్నారు.
శంకరపట్నం, మార్చి 8: మండల కేంద్రంలో దేవసేన మహిళా గ్రూప్ ఆధ్వర్యంలో మహిళలు, యువతులు కేకట్ కట్ చేసి స్వీట్లు పంచుకున్నారు. ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకొన్నారు. కార్యక్రమంలో ముదిరాజ్ మహాసభ జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లె స్వరూప, మహిళా నాయకురాళ్లు వెంకటలక్ష్మి, గుర్రం కళావతి, శ్రీదేవి, రాధ, మహేశ్వరి, శారద, స్వప్న, లక్ష్మి, వనిత, అఖిల, సుష్మ, స్వప్న, రమ్య, లలిత, మంగ, ఉమ, అనిత, కోమల, కనకమ్మ, శాంత పాల్గొన్నారు. అలాగే కేశవపట్నం గ్రామ పంచాయతీ కార్యాలయంలో మహిళా గ్రామసభ, పంచాయతీ కార్యదర్శి నర్సయ్య ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. గ్రామంలోని సీనియర్ మహిళలను శాలువాలతో సన్మానించారు. స్వీట్లు పంపిణీ చేశారు.
వీణవంక, మార్చి 8: మండల కేంద్రంలో వాసవీ క్లబ్ మండలాధ్యక్షుడు హరి, గ్రామాధ్యక్షుడు రామిడి శ్రీధర్, వనిత క్లబ్ గ్రామాధ్యక్షురాలు అయిత స్వాతి ఆధ్వర్యంలో గూడ లలిత, వనిత క్లబ్ ఆర్సీలను, గంగారం గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో ఐకేపీ, అంగన్వాడీ టీచర్లను మండల పరిషత్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీధర్, ఎంపీవో సురేందర్‌కుమార్, వాసవీ క్లబ్ సభ్యులు అల్లెంకి రవి, రమేశ్, సాంబమూర్తి, లక్ష్మయ్య, కృష్ణమూర్తి, శ్రీనివాస్ పాల్గొన్నారు.
చిగురుమామిడి, మార్చి 8: ఇందుర్తి గ్రామంలో శ్రామిక మహిళా సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా కన్వీనర్ మారేళ్ల శ్రీలత, వేముల రమ, మార్గ సత్తవ్వ, స్వరూప, సుగుణ, సౌమ్య, పావని, లావణ్య, స్ఫూర్తి, ప్రమీల, కనకవ్వ, తదితరులు పాల్గొన్నారు.
హుజూరాబాద్ టౌన్, మార్చి 8: పట్టణంలోని కోర్టు ఆవరణలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు, మెగా లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ సందర్భంగా సబ్ జడ్జి పీబీ కిరణ్ కుమార్ మాట్లాడుతూ.. దేశంలో అన్ని రంగాల్లో మహిళలు రాణిస్తున్నారని ప్రశంసించారు. కార్యక్రమంలో మెజిస్ట్రేట్లు జీ స్వాతి, పద్మ సాయిశ్రీ, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గోసుల శ్రీనివాస్, ఏజీపీ గుర్రం శ్రీనివాస్, సీఐలు తిరుమల్ గౌడ్, వీ రవి, బార్ అసోసియేషన్ కార్యదర్శి మట్టెల తిరుపతి, లోక్ అదాలత్ సభ్యుడు వై అరుణ్ కుమార్, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. పట్టణంలోని కేసీ క్యాంపులో గల ఏసీపీ కార్యాలయంలో హుజూరాబాద్ సబ్ డివిజన్ పరిధిలోని మహిళా పోలీసులను ఏసీపీ శ్రీనివాస్ జీ ఘనంగా సన్మానించారు. అలాగే, పట్టణంలోని పోలీస్ స్టేషన్లో పట్టణ సీఐ తిరుమల్ గౌడ్ మహిళా పోలీసులను సన్మానించి, బహుమతులు అందించారు. కార్యక్రమంలో జమ్మికుంట సీఐలు వరగంటి రవి, కిశోర్‌తోపాటు సబ్ డివిజన్ పరిధిలోని మహిళా పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. పట్టణంలో తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్, తెంలగాణ బీసీ సిటిజన్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో హుజూరాబాద్ ఏఎస్ఐ కమల, హెచ్ఆర్సీ జిల్లా కమిటీ మెంబర్ పులుగు లతారెడ్డి, లీగల్ సెల్ అసిస్టెంట్ మెంబర్ బూర సరితను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో టాప్రా జిల్లా అధ్యక్షుడు చందుపట్ల జనార్ధన్, బీసీ నాయకులు, టాప్రా హుజూరాబాద్ అధ్యక్షుడు నరేందర్, ట్రెజరరీ వీరస్వామి తదితరులు పాల్గొన్నారు.
తిమ్మాపూర్, మార్చి 8: మండలంలోని ఎల్ఎండీ కాలనీలో మాజీ జడ్పీటీసీ ఉల్లెంగుల పద్మా ఏకానందం ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ సంబురాలు జరుపుకొన్నారు. మాజీ ఎంపీపీ కేతిరెడ్డి వనితాదేవేందర్రెడ్డితో కలిసి మండలంలోని మాజీ మహిళా ప్రజాప్రతినిధులను శాలువాలతో సత్కరించారు. జ్ఞాపిక అందజేసి, చీర బహూకరించారు. కార్యక్రమంలో బూడిద ప్రేమలత, మాతంగి స్వరూప, పాశం తిలక్ప్రియ, త్రివేణి, వినోద, ఉమారాణి, విజయ, సుజాత, తదితరులు పాల్గొన్నారు. అలాగే, ఎల్ఎండీ పోలీస్‌స్టేషన్‌లో ఎస్ఐ వివేక్ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. తిమ్మాపూర్ సీఐ స్వామి ముఖ్య అతిథిగా హాజరై స్టేషన్లో ఉన్న మహిళా సిబ్బందిని సత్కరించారు.