Pavan Kalyan : ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pavn Kalyan) కొండగట్టు అంజనేయుడి(Kondagattu Anjaneyudu) దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఓ మహిళ చేతులు జోడించి తమ కుటుంబాన్ని ఆదుకోవాలని జనసేన అధినేత పవన్‌ను వేడుకుంది. ‘అయ్యా పవన్ కల్యాణ్.. ఇప్పటికైనా మా కుటుంబాన్ని ఆదుకోండి. మూడేళ్ల క్రితం మీకోసం వెళ్లిన మా కుమారుడు చనిపోయాడు. చేతికొచ్చిన బిడ్డను కోల్పోయాం. మీరైనా మమ్మల్ని ఆదుకోండి’ అని ఆ మహిళ విన్నవించడం చూసి కళ్లు చెమర్చుతున్నాయి.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ మూడేళ్ల క్రితం కొండగట్టుకు వచ్చారు. అప్పుడు అభిమానులు పెద్ద సంఖ్యలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ సందర్భంగా పూస రాజ్ కుమార్ (Poosa Raj Kumar) అనే యువకుడు మరణించాడు. అయితే.. అభిమాని మృతి చెందినందుకు పవన్ కల్యాణగానీ, ఆయన అభిమానులుగానీ రాజ్‌కుమార్ కుటుంబానికి ఎలాంటి ఆర్ధిక సాయం చేయలేదు. మూడేళ్ల తర్వాత పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో శనివారం కొండగట్టుకు వచ్చాడు. దాంతో.. ఇప్పటికైనా తమను ఆదుకోవాలని పూస రాజ్‌కుమార్ కుటుంబ సభ్యులు పవన్ కల్యాణ్‌ను వేడుకుంటున్నారు.
అయ్యా పవన్ కళ్యాణ్ గారు, ఇప్పటికైనా మా కుటుంబాన్ని ఆదుకోండి
మూడేళ్ల క్రితం పవన్ కళ్యాణ్ కొండగట్టుకు వచ్చినప్పుడు బైక్ ర్యాలీలో పూస రాజ్ కుమార్ అనే వ్యక్తి మరణించాడు
అప్పటినుండి పవన్ కళ్యాణ్ నుండి కానీ అతని అభిమానుల నుండి కానీ ఎలాంటి సహాయం అందలేదు
పవన్ కళ్యాణ్ ఈరోజు మళ్లీ… pic.twitter.com/X0Zu43sayS
— Telugu Scribe (@TeluguScribe) January 3, 2026