Kalvasrirampur | వెన్నంపల్లిలో పాముకాటుతో మహిళ మృతి
ఇంటి ముందు వాకిలి ఊడుస్తుండగా పాముకాటుకు గురై మహిళ మృతి చెందింది. ఈ సంఘటన కాల్వశ్రీరాంపూర్ మండలంలోని వెన్నంపల్లిలో మంగళవారం చోటుచేసుకుంది.
Kalvasrirampur | కాల్వశ్రీరాంపూర్, మే19: ఇంటి ముందు వాకిలి ఊడుస్తుండగా పాముకాటుకు గురై మహిళ మృతి చెందింది. ఈ సంఘటన కాల్వశ్రీరాంపూర్ మండలంలోని వెన్నంపల్లిలో మంగళవారం చోటుచేసుకుంది. గ్రామస్తులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. వెన్నంపల్లి కి చెందిన పూసాల వజ్రమ్మ (69) సోమవారం సాయంత్రం ఇంటి ముందర వాకిలిని ఊడుస్తుండగా ఎడమకాలు బొటనవేలుపై ప్రమాదావశాత్తు నాగుపాము కాటువేసింది. వెంటనే ఇంటి పక్కన ఉన్న వారికి విషయం చెప్పింది. వారు పెద్దపల్లి లో ఉన్న కుమారుడు రమణాచారికి సమాచారమిచ్చారు.
హుటాహుటిన వజ్రమ్మను చికిత్స నిమిత్తం పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తుండగా పరిస్థితి విషమించడంతో అదే రోజు రాత్రి మృతి చెందింది. మృతురాలి కుమారుడు రమణాచారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెంకటేశ్ తెలిపారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వపరంగా ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Newzealand | భారత్‌తో వందేళ్ల క్రీడానుబంధం.. వన్డే సిరీస్ కోసం ప్రత్యేక జెర్సీ విడుదల..!
Thulabharam | రవితేజ, వివేక్ ఆత్రేయ క్రేజీ కాంబో.. ‘తులాభారం’ టైటిల్ గ్లింప్స్ వచ్చేసింది!
Prabhas Birthday | ప్రభాస్ బర్త్‌డే కానుక.. థియేటర్లలో సందడి చేయనున్న డార్లింగ్ బ్లాక్‌బస్టర్ మూవీస్ ‘వర్షం’, ‘ఛత్రపతి’!
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

