మీరెటు..అభివృద్ధి వైపా? ఆరాచకం వైపా?
అరవైఏండ్లు అధికారం వెలగబెట్టిన కాంగ్రెస్ చేసిందేమీలేదు.. తాగు, సా గునీరివ్వకుండా గోసపెట్టింది..అవినీతి, అరచకా లు సృష్టించి పబ్బంగడుపుకున్నది..కానీ, తొమ్మిదేండ్ల కేసీఆర్ పాలనలో అభివృద్ధి, సంక్షేమం జోడెద్దుల్లా సాగుతున్నది.
- కాంగ్రెస్సు నమ్మి ఆగంకావద్దు
- వాళ్లస్తే సంక్షేమ పథకాలను ఎత్తేస్తరు
- బీఆర్ఎస్ను ఆదరిస్తేనే మరింత ప్రగతి
- పెద్దపల్లి ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి దాసరి మనోహర్‌రెడ్డి
- ఎలిగేడు మండలం ధూళికట్టలో ప్రచారం
పెద్దపల్లి, నవంబర్2: ‘అరవైఏండ్లు అధికారం వెలగబెట్టిన కాంగ్రెస్ చేసిందేమీలేదు.. తాగు, సా గునీరివ్వకుండా గోసపెట్టింది..అవినీతి, అరచకా లు సృష్టించి పబ్బంగడుపుకున్నది..కానీ, తొమ్మిదేండ్ల కేసీఆర్ పాలనలో అభివృద్ధి, సంక్షేమం జోడెద్దుల్లా సాగుతున్నది. వ్యవసాయం పండుగైం ది. అర్హులందరికీ స్కీంలు అందడంతో ఇంటింటా సంతోషం వెల్లివిరుస్తుది..’ ప్రజలారా ఆలోచించండి..మీరు అరాచక పాలన చేసిన కాంగ్రెస్ వైపు ఉంటారా? సంక్షేమ పాలనందించిన బీఆర్ఎస్ వైపు ఉంటారా? తేల్చుకోండి’ అంటూ పెద్దపల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి దాసరి మనోహర్‌రెడ్డి పిలుపునిచ్చారు.
గురువారం ఎలిగేడు మండలం ధూళికట్టలో ఇంటింటా ప్రచారం ప్రచారం చేశా రు. మ్యానిఫెస్టోనూ చూపుతూ ఓట్లు అభ్యర్ధించా రు. అనంతరం మాట్లాడుతూ ప్రజా సంక్షేమం. అభివృద్ధిని కాంక్షించే కారుగుర్తుకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. పొరపాటున కాంగ్రెస్‌కు ఓటేస్తే మన కంట్లో మనమే వేలు పెట్టుకున్న వాళ్లమవుతామని హెచ్చరించారు. ధూళికట్ట శివాలయంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు చేశారు. తాను ఎమ్మెలే ్య గా, కేసీఆర్ హ్యాట్రిక్ సీఎంగా గెలువాలని సాధించాలని శివుడిని వేడుకున్నట్లు చెప్పారు. హస్తం పార్టీ అధికారమిస్తే 3 గంటల కరెంటే దిక్కవుతుందన్నారు.
వారెంటీ లేని కాంగ్రెస్ 6 గ్యారెంటీలను నమ్మవద్దని సూచించారు. ధరణి పోర్టల్‌ను రద్దు చేస్తామని చెబుతున్న ఆ పార్టీ పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. సీఎం కేసీఆర్ సబ్బండ వర్గాల అ భ్యున్నతి కోసం మ్యానిఫెస్టో రూపొందించారని తెలిపారు. సీఎం కేసీఆర్ పెద్దపల్లిని జిల్లా కేంద్రం గా ప్రకటించడంతో అన్ని రంగాల్లో అభివృద్ధిలో దూసుకెళ్తున్నదని చెప్పారు. మళ్లీ అధికారం ఇస్తే మరింత అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. కాళేశ్వరం నిర్మించి పుష్కలంగా సాగునీరందిస్తుండడంతో రెండు పంటలు సమృద్ధిగా పండడంతో రైతుల ఆర్ధిక స్థితిగతులు మెరగుపడ్డాయని వివరించారు. ఎవరెన్నీ మాయమాటలు చెప్పిన నమ్మకుండా కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

