Peddur | సిరిసిల్ల రూరల్, ఆగస్టు 13: సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని పెద్దూరు సింగిల్ విండో కార్యాలయాన్ని సిరిసిల్ల వ్యవసాయ అధికారి సందీప్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. యూరియా కోసం ‘రైతుల గోస’ అనే శీర్షికన ‘నమస్తేతెలంగాణ’లో బుధవారం వార్త ప్రచురితమైంది. దీంతో స్పందించిన సిరిసిల్ల ఏవో సందీప్ పెద్దూరులోని సింగిల్ విండో కార్యాలయంలో యూరియా పంపిణీని క్షేత్ర స్థాయిలో పర్యవేక్షించారు.
యూరియాను సక్రమంగా పంపిణీ చేయాలని, చివరి రైతు వరకు యూరియా అందేలా చూస్తామని తెలిపారు. యూరియా కొరత లేదని ఆయన పేర్కొన్నారు. కాగా ఇక్కడ రైతులు ఇబ్బందులు పడుతుంటే ఆ అధికారి యూరియా కొరత లేదని పేర్కొనడం గమనార్హం. ఆయన వెంట సీఈవో గౌరి శంకర్, సిబ్బంది ఉన్నారు.