Maestro junior college | కోరుట్ల, జూలై 5: పట్టణంలోని ముక్కాస్ ఫంక్షన్ హల్లో శనివారం మాస్ట్రో జూనియర్ కళాశాల ఫ్రేషర్స్ ఫేస్ట్- 2025 పేరిట స్వాగతోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ విద్యార్థులు ప్రథమ సంవత్సరం విద్యార్థులకు స్వాగతం పలుకుతూ తెలంగాణ సాంప్రదాయం ఉట్టిపడేలా నిర్వహించిన సినీ, జానపద సాంస్కృతిక నృత్య రూపకాలు అలరించాయి.
విద్యార్థులు ఇష్టపడి చదివి ఉన్నత ఉద్యోగాల్లో స్థిర పడాలని కరస్పాండెంట్ ఆకుల రాజేష్ అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రైవేట్ కళాశాలల కరస్పాండెంట్లు బారీ, మహదేవ్, సత్యనారాయణ, దీపక్, రమేష్, వెంకటేష్, శ్రీనివాస్, రాజేంద్ర ప్రసాద్, నరేష్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.