ఉద్యానవనంగా బసంత్‌నగర్ పోలీస్‌స్టేషన్
రామగుండం సీపీ చంద్రశేఖర్‌రెడ్డి
నవీకరణ అనంతరం పునః ప్రారంభం
పెద్దపల్లి, ఫిబ్రవరి 2(నమస్తే తెలంగాణ): పచ్చదనంతో నిండిన ఆహ్లాదకరమైన వాతావరణంలో పనిచేస్తే అలసట ఉండదని రామగుండం పోలీస్ కమిషనర్ చంద్రశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. రామగుం డం కమిషనరేట్ పరిధిలోని పాలకుర్తి మండలం బసంత్‌నగర్ పోలీస్‌స్టేషన్‌ను నవీకరించగా ఆయ న బుధవారం పునః ప్రారంభించారు. పచ్చని మొక్కలతో ఆహ్లాదకరంగా ఉన్న పోలీస్‌స్టేషన్ ఆవరణను చూసి ఆనందం వ్యక్తం చేశారు. ఇలాంటి వాతావరణంలో పనిచేసే వారు ఆరోగ్యంగా ఉం టారన్నారు. బసంత్ నగర్ పోలీస్‌స్టేషన్‌లో 5ఎస్ ఇంప్లిమెంటేషన్ పక్కాగా అవుతున్నదని చెప్పారు. సిబ్బంది పనితీరు మెరుగు పడిందని, ఫిర్యాదుదారులకు త్వరితగతిన సేవలు అందుతున్నాయని హర్షం వ్యక్తం చేశారు. సిబ్బంది సమష్టిగా పని చే యడంతో ఠాణా ఉద్యానవనాన్ని తలపిస్తున్నదని, ఇందుకోసం కృషి చేసిన పెద్దపల్లి డీసీ పీ పులిగిల్ల రవీందర్, ఏసీపీ సారంగపాణి, సీఐ ప్రదీప్‌కుమా ర్, ఎస్ఐలు మహేందర్, రాజేశ్, శి వాని, సిబ్బందిని సీపీ ప్రత్యేకంగా అభినందించారు.
గంజాయి రహిత కమిషనరేట్‌గా తీర్చిదిద్దుతాం
గంజాయిని పూర్తిస్థాయిలో నియంత్రించి గంజాయి రహిత కమిషనరేట్‌గా రామగుండంను తీర్చిదిద్దుతామని సీపీ చంద్రశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. గంజాయి నియంత్రణపై ముద్రించిన వాల్‌పోస్టర్, కరపత్రాలను బుధవారం ఆవిష్కరించి మాట్లాడారు. గంజాయి వంటి మత్తు పదార్థాల నియంత్రణకు సమష్టిగా కృషి చేయాలన్నారు. కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లో ప్రజాప్రతినిధులు, యువకులు, విద్యార్థులకు గంజాయితో కలిగే అనర్థాలపై అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తామని తెలిపారు.