సిరిసిల్ల రూరల్ : అక్రమ కేసులో జైలుకు వెళ్లిన తంగళ్లపల్లి మండలం జిల్లెల్లకు చెందిన రైతు అబ్బడి రాజిరెడ్డి బుధవారం జైలు నుంచి విడుదలయ్యారు. మాజీ మంత్రి కేటీఆర్ చొరవతో బెయిల్ మంజూరుకావడంతో విడుదలై ఇంటికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో గురువారం సిరిసిల్ల జిల్లా రెడ్డి సంఘ నేతలు ఆయనను పరామర్శించారు. రెడ్డి సంఘ జిల్లా అధ్యక్షుడు గుండారపు కృష్ణారెడ్డి, సంఘానికి చెందిన ఇతర నాయకులు రాజిరెడ్డిని పరామర్శించిన వారిలో ఉన్నారు.
రాజిరెడ్డికి తాము అండగా ఉంటామని రెడ్డి సంఘం నాయకులు భరోసానిచ్చారు. అక్రమ కేసులతో రైతులను వేధించడం సరైనది కాదని అన్నారు. రాజిరెడ్డిని పరామర్శించిన రెడ్డి సంఘం నాయకులలో మండల అధ్యక్షుడు యేసిరెడ్డి రాంరెడ్డి, మాజీ సింగిల్ విండో చైర్మన్ పబ్బతి విజయేందర్ రెడ్డి, కృష్ణారెడ్డి, మాట్ల మధు, మోహన్ రెడ్డి, రెడ్డి సంఘ నేతలు తదితరులు ఉన్నారు.