Upcoming elections | మల్లాపూర్, ఆగష్టు 2: గ్రామాల్లో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ పార్టీ ఆభ్యర్థుల గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలని ఆ పార్టీ రాష్ట్ర నేత చిట్నేని రఘు అన్నారు. మండలంలోని ముత్యంపేట, మల్లాపూర్, వాల్గొండ, పాతదాంరాజ్పల్లి గ్రామాల్లో పలు సంఘ భవనాల నిర్మాణాలకు ఎంపీ ల్యాండ్స్ కింద మంజూరైన నిధుల పత్రాలను సంఘాల సభ్యులకు ఆదివారం అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్షేమ పథకాల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, రానున్న రోజుల్లో బీజేపీనే రాష్ట్రంలో అధికారంలోకి రావడం ఖాయమాని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు రాచకొండ యాదగిరిబాబు, మండలాధ్యక్షుడు గోపిడి శ్రీనివాస్ రెడ్డి, మండల ఇంచార్జీ వడ్డెపల్లి శ్రీనివాసన్, బీజేవైఎం మండలాధ్యక్షుడు పందిరి నాగరాజ్, జిల్లా కార్యదర్శి ఎర్ర లక్ష్మీ, నాయకులు లవంగ శివ, గజ్జి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.