Peddapally | పెద్దపల్లి, జనవరి 20: ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకుని భవిష్యత్‌లో ముందుకెళ్లాలని పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీ హర్ష సూచించారు. కేంద్ర బలగాలలో ఉద్యోగం సాధించిన యువతకు జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష ప్రత్యేక అభినందనలు తెలిపారు. మూడు నెలల ఉచిత శిక్షణ పొంది కేంద్ర బలగాలలో ఉద్యోగాలు సాధించిన యువకులను జిల్లా కలెక్టర్ తన చాంబర్లో సన్మానించారు.
తెలంగాణ స్టేట్ పోలీస్ కానిస్టేబుల్, ఎస్సై పరీక్షల కోసం జిల్లాలో నిర్వహించిన 3 నెలల ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకొని దాసం శ్యామ్, బీ ప్రశాంత్ సీఐఎస్ఎఫ్లో, రావవవేని స్వప్న బీఎస్ఎఫ్ కేంద్ర బలగాలలో కానిస్టేబుల్‌గా ఉద్యోగాలు సాధించారని, భవిష్యత్తులో మరింత కష్టపడి జీవితంలో ఎన్నో విజయాలు సాధించాలని కలెక్టర్ ఆకాంక్షించారు. ఇక్కడ డీఎంవో పీ ప్రవీణ్‌రెడ్డి, తదితరులున్నారు.