Babu Jagjivan Ram | కోరుట్ల, జూలై 6: భారత మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ ఆశయాల సాధన కోసం కలిసి కట్టుగా ముందుకు సాగాలని తెలంగాణ ప్రజాసంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ పేట భాస్కర్ అన్నారు. పట్టణంలోని అంబేద్కర్ నగర్ బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం వద్ద మున్సిపల్ శాఖ, విగ్రహ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం జగ్జీవన్ రామ్ వర్థంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా బాబు విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.
ఈ మేరకు ఆయన మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం అనేక సంస్కరణలు ప్రవేశపెట్టారని పేర్కొన్నారు. 40 ఏళ్లపాటు వివిధ మంత్రి పదవులు అధిరోహించిన ఆయన ఉప ప్రధానిగా దేశానికి సేవలు చేశారని కొనియాడారు. బాబు జగ్జీవన్ రామ్ కు దేశ అత్యున్నత పురస్కారం భారత రత్న ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పట్టణంలో జగ్జీవన్ రావ్ పార్కు పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయని పేర్కొన్నారు.
పార్కు నిర్మాణానికి అధికారులు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో విగ్రహా కమిటీ ప్రధాన కార్యదర్శి చిట్యాల లచ్చయ్య, నాయకులు మోర్తాడ్ లక్ష్మీ నారాయణ, బెక్కెం అశోక్, బొల్లె గంగాధర్, పసుల చిన్నయ్య, సామల్ల దశరథం, శనిగారపు రాజేశ్వర్, చిట్యాల అశోక్, రాంబాబు, రవి సంజీవ్, రూపెష్, రాజు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.