Thimmapur | తిమ్మాపూర్, ఆగస్టు 21 : గన్నేరువరం మండలం గుండ్లపల్లి నుండి గన్నేరువరం మండల కేంద్రంతో పాటు ఇల్లంతకుంట మండలానికి మంజూరైన రోడ్డు పనులు పూర్తికాక అధ్వానంగా తయారైంది. దీంతో జంగాపల్లి గ్రామానికి చెందిన మూడో తరగతి విద్యార్థిని శ్వేతాన్షి అనే చిన్నారి చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ‘గుడ్ మార్నింగ్ ఎవరీ వన్.., మై నేమ్ ఇస్ శ్వేతాన్షి.., స్టడీ థర్డ్ క్లాస్..’ అంటూ మొదలుపెట్టి రోడ్డు వల్ల గ్రామస్తులు పడుతున్న ఇబ్బందులను ఇంగ్లీషులో వివరించింది. తమకు రోడ్డు కావాలని, ఇది చాలా అధ్వానంగా ఉందని వివరించింది. స్కూలుకు వెళ్లడానికి చాలా ఇబ్బందిగా ఉందని, తమ భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని రోడ్డును త్వరగా వేయించాలని సీఎం సార్.. అంటూ రిక్వెస్ట్ చేసింది.