Peddapally | పెద్దపల్లి, ఆక్టోబర్ 22: పెద్దపల్లి జిల్లాలో 32 స్కానింగ్ సెంటర్లు ఉండగా, ప్రతీ నెల 10 చొప్పున తనిఖీ చేస్తున్నామని డీఎంహెచ్వో డాక్టర్ వాణి శ్రీ తెలిపారు. కల్టెరేట్లోని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో పీసీసీ ఎన్డీటీ అడ్వైజరీ కమిటీ సమావేశం బుధవారం నిర్వహించారు.
గర్భస్థ శిశువు లింగ నిర్ధారణ వ్యతిరేక చట్టం -1994 (పీసీపీ ఎన్డీటీ) ప్రకారం పుట్ట బోయే బిడ్డ అడ, మగ అని చెప్పడం నేరమని, లింగ నిర్దారణ చేసిన వారికి, చేయమని అడిగిన వారికి మూడేళ్ల జైలు శిక్షతో పాటు రూ.10వేల జరిమానా విధిస్తామని డీఎంహెచ్వో తెలిపారు. ఈ సమావేశంలో పిల్లల వైద్య నిపుణులు రవీందర్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ పీ రాకేశ్, రెడ్ క్రాస్ సోసైటీ అధ్యక్షుడు రాజగోపాల్, జిల్లా సమైక్య అధ్యక్షురాలు స్నేహ, తదితరులు పాల్గొన్నారు.