Rollavagu project | సారంగాపూర్, ఆగస్టు 20: బీర్ పూర్ మండల కేంద్రం శివారులోని రోళ్లవాగు ప్రాజెక్ట్ నిర్మాణ పనులు దాదాపు 90శాతం పనులు పూర్తికాగా అటవి అనుమతులు ఆలస్యం అవుతుండడంతో షటర్లు బిగించక పోవడంతో భారీగా కురుస్తున్న వర్షాలతో పాటు శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నుండి కాలువల ద్వారా వచ్చె నీరు భారీగా చేరుతుంది. కాని ప్రాజెక్టు కు షటర్లు బించకపోవడంతో వచ్చిన నీరు వచ్చినట్లే బయటకు వెళ్లి పోతుండడంతో ప్రాజెక్ట్ లో నీరు నిల్వ ఉండడం లేదు.
దీంతో రైతులకు అవసరమైనప్పుడు నీటీని విడుదల చేయడానికి ప్రాజెక్ట్ లో నీరు లేకపోవడంతో రైతులు పంటలకు సాగుకు నీరందక ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షాలకు ప్రాజెక్ట్ లోకి నీరు వచ్చి చేరిన ఆగే పరిస్థితి లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోళ్లవాగు ప్రాజెక్ట్ నిర్మాణంలో ప్రభుత్వం ఇప్పటికైన స్పందించి ప్రత్యేక దృష్టి సారించి మిగిలిపోయిన ఆటవి అనుమతులు వచ్చెలా చేసి త్వరగా షటర్లు బిగించి రైతులకు సాగు నీటి ఇబ్బందులు లేకుండా ఆదుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు.