మానకొండూర్, జనవరి 12: మానకొండూర్ నియోజకవర్గవ్యాప్తంగా గురువారం స్వామి వివేకానంద జయంతి వేడుకలను గురువారం ఘ నంగా నిర్వహించారు. ఆయన విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ వివేకానందుడి మార్గం అనుసరణీయమని పేర్కొన్నారు. మానకొండూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపాల్ వీ ఆంజనేయరావు వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మార్కెట్ ఏరియా వద్ద ఎన్జీపీఎస్వో సంస్థ అధ్యక్షుడు బొద్దుల శ్రావణ్ వివేకానందుడి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.
శంకరపట్నం, జనవరి 12: మండల కేంద్రంలో బీజేవైఎం నేతలు వివేకానంద చిత్ర పటానికి పూ లమాలలు వేసి నివాళులర్పించారు. ఎంపీటీసీ, బీజేపీ మండలాధ్యక్షుడు ఎనుగుల అనిల్, బీజేవైఎం మండలాధ్యక్షుడు బొడిగె నరేశ్, మండల ప్రధాన కార్యదర్శి బోడ తిరుపతిరెడ్డి, నాయకులు జనగాం ప్రణయ్, బొంగోని అఖిల్, బోదాసు సాయి, గౌరవేని శ్రీనివాస్ పాల్గొన్నారు.
క్రీడా సామగ్రి అందజేత
కరీంనగర్ నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో కేశవపట్నం ఆదర్శ యూత్ క్లబ్‌కు క్రీడా సామగ్రి అందేజేశారు. వివేకానంద జయంతి యువజన ది నోత్సవాన్ని పురస్కరించుకొని ఆదర్శ యూత్ క్లబ్ స్వచ్ఛంద సేవలకు గుర్తింపుగా జిల్లా యువజన శాఖ అధికారి వెంకట రాంబాబు చేతుల మీదుగా క్లబ్ అధ్యక్షుడు బొంగోని అభిలాష్‌కు వాలీబాల్, పుట్‌బాల్, బాడ్మింటన్, క్యారం బోర్డ్, తదితర క్రీడా సామగ్రి గురువారం కరీంనగర్లో అందజే శారు. ఈ సందర్భంగా యూత్ క్లబ్ సభ్యులు రక్త దానం చేశారు. కార్యక్రమంలో జాతీ య యువజన వలంటీర్ భూస రాకేశ్, పవన్‌కుమార్, న్యాలం మణిసాయి, ఆదర్శ క్లబ్ సభ్యులు ఉన్నారు.
సత్ప్రవర్తనను అలవరుచుకోవాలి..
చిగురుమామిడి, జనవరి 12: యువత సత్ప్రవర్తనను అలవరుచుకోవాలని ఎస్ఐ దాస సుధాకర్ పిలుపునిచ్చారు. వివేకానంద జయంతిని పురసరించుకొని మండలంలోని నవాబుపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రణతి ఫౌండేషన్ ఆధ్వ ర్యంలో విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన, డ్రాయింగ్ పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులను అందజేశారు. ఫౌండేషన్ చైర్మన్ బాయిని వంశీకృష్ణ, రెడ్డి సంఘం అధ్యక్షుడు మ హిపాల్ రెడ్డి, భరత్‌రెడ్డి, మాజీ ఎస్ఎంసి చైర్మన్ తిరుపతి పాల్గొన్నారు.
తిమ్మాపూర్ రూరల్, జనవరి12: గన్నేరువరం లో వివేకానంద యూత్వేల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వివేకానం ద జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. తహసీల్దార్ బావుసింగ్, మాజీ జడ్పీటీసీ జువ్వాడి మన్మోహన్రావు హాజరై, వివేకానందుడి విగ్రహానికి పూలమాల వే సినివాళులర్పించారు. కేకు కోసి ఆయన ఆశయా ల కోసం యువత పాటుపడాలని సూచించారు. గన్నేరువరం జడ్పీహైస్కూల్లో విద్యార్థులకు వ క్తృత్వ పోటీలు నిర్వహించి, ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. పేదలకు దు ప్పట్లు పంపిణీ చేశారు. అసోసియేషన్ అ ధ్యక్షుడు తిప్తర్తి ప్రవీణ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నుస్తులాపూర్ సొసైటీ చైర్మన్ అలువాల కోటి, సర్పంచ్ పుల్లెల లోఈ్మలక్ష్మణ్, ఉపసర్పంచ్ బూర వెంకటేశ్వర్లు, బొడ్డు సునీల్ ఉన్నారు.
తిమ్మాపూర్ మండలంలో..
తిమ్మాపూర్ రూరల్, జనవరి12: బీజేపీ తిమ్మాపూర్ మండల శాఖ ఆధ్వర్యంలో రామకృష్ణకాలనీ గ్రామంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో బీజేపీ మండలాధ్యక్షుడు సుగుర్తి జగదీశ్వరాచారి, పబ్బ తిరుపతి, ఉప్పులేటి బాబు, బోళ్ల శంకర్, సిద్ద శ్రీనివాస్, మురళి తదితరులు పాల్గొన్నారు.