కమాన్‌చౌరస్తా, మార్చి 30 : ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ఆదివారం నగరంలో వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. విశ్వావసు నామ సంవత్సరంలో ప్రజలు ఆయురారోగ్యాలతో ఉంటారని వేద పండితులు పంచాం గం పఠించి, రాశుల ఫలితాలు వివరించారు. నగరంలోని అన్ని దేవాలయాల్లో, కాలనీల్లో పంచాంగ శ్రవణాన్ని పఠించారు. ఈ సందర్భంగా ఉగాది పచ్చడి పంపిణీ చేశారు. దేవాలయాల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు అర్చనలు, అభిషేకాలు, సహస్రనా మార్చన, హోమాల వంటి ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించగా, ఆలయాలన్ని భక్తులతో కిటకిటలాడాయి. జిల్లా కేంద్రంలోని 6వ డివిజన్ యజ్ఞ వరహాస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి, పంచాంగ శ్రవణంలో మాజీ మంత్రి కరీంనగర్ శాసన సభ్యుడు గంగుల కమలాకర్ కుటుంబ సభ్యులతో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఆయనతో పాటు యజ్ఞ వరహస్వామి ఆలయ కులపతి శ్రీ భాష్యం వరప్రసాద్, మాజీ ఎమ్మెల్యే వుచ్చిడి మోహన్ రెడ్డి, నగర బీఆర్ఎస్ అధ్యక్షుడు చల్ల హరిశంకర్, స్థానిక డివిజన్ కార్పొరేటర్ కోల మాలతి సంపత్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు గందె మహేశ్, బోనా ల శ్రీకాంత్, ఒంటెల సత్యనారాయణరెడ్డి, ఐజేందర్ యా దవ్, మాజీ అర్బన్ బ్యాంకు డైరెక్టర్ కర్ర సూర్య శేఖర్, ఒడ్నాల రాజు, నారదాసు వసంత్ రావు, కలర్ సత్తన్న, ఆలయ కమిటీ బాధ్యులు సాయిని నరేందర్, రాణి- వెంకటేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.
చొప్పదండి, మార్చి30 : శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురసరించుకుని శ్రీ వేంకటేశ్వర మణికంఠ ఆలయంలో పోలోజు చరణాచార్యులు స్వామి వారికి ప్రత్యేక పూజలు చేసి, అనంతరం పంచాంగ శ్రవణం నిర్వహించి, భక్తులకు ఈ సంవత్సర కాలంలో జరగబో యో మంచి, చెడులు, స్థితి గతులను తెలియజేశారు. ఆలయ అధ్యక్షుడు బొడిగె వెంకటేశ్, ప్రధా న కార్యదర్శి చేపూరి సత్యనారాయణ, సభ్యులు బొడిగె వెంకన్న, ఎలిగేటి రాములు, గొల్లపెళ్లి శ్రావణ్ కుమార్, నలుమాచు రామకృష్ణ, కత్తి రమేశ్, వెల్మ విజేందర్ రెడ్డి, పుసాల భూమేశ్, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. శంకరపట్నం, మార్చి 30: మండలంలోని కేశవపట్నం హనుమాన్ ఆలయంలో చక్రపాణి వెంకటాచార్యులు, కొత్తగట్టు శ్రీమత్స్యగిరీంద్రస్వామి ఆలయంలో శేషం మురళీధరాచార్యులు, ఇతర గ్రామాల్లో ఆయా గ్రామాల పురోహితులు పంచాంగ పఠనం చేశారు. గ్రామస్తులు పాల్గొన్నారు.
చిగురుమామిడి, మార్చి 30: మండలంలో అన్ని గ్రామాల్లో గ్రామస్తులు ఉదయం దేవాలయాలకు వెళ్లి ప్రత్యేక పూజ చేశారు. చిగురుమామిడి, రేకొండ, బొమ్మనపల్లి, సుందరగిరి, రామంచ, నవాబ్ పేట, ములనూరు తదితర గ్రామాల్లో భక్తులు ఆలయాల్లో పూజలు చేసి, పంచాంగ శ్రవణంలో పాల్గొన్నారు.
వీణవంక: మండల కేంద్రంలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రముఖ వేదపండితులు గూడ జగదీశ్వరశర్మ విశ్వావసు నామ సంవత్సర ఉగాది పంచాంగాన్ని శ్రోతలకు వినిపించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ ముసిపట్ల రేణుక-తిరుపతిరెడ్డి, మాజీ జడ్పీటీసీ వనమాల-సాదవరెడ్డి, సింగిల్ విండో చైర్మన్ విజయభాస్కర్‌రెడ్డి మండల ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.
కరీంనగర్ రూరల్, మార్చి 30 : విభిన్న రుచుల సమ్మేళనంతో కష్టసుఖాలపై సమభావనను జీవన తాత్వికతను బోధించేదే ఉగాది పంచాంగ శ్రవణమని నగునూర్ దుర్గాభవానీ ఆలయ అర్చకుడు పవనకృష్ణ శర్మ సూచంచారు. దుర్గాభవానీ ఆలయంలో విశ్వావసు నామ సంవత్సరం చైత్ర మాస వసంతోత్సవం నిర్వహించారు. ఈ ఫౌండర్ చైర్మన్ వంగల లక్ష్మణ్, భక్తులు పాల్గొన్నారు. హౌసింగ్‌బోర్డుకాలనీ, మార్చి 30: కరీంనగర్ పట్టణంలోని ఆదర్శనగర్ జెండా చౌరస్తాలో ఆదివారం ఆదర్శనగర్ అభివృద్ధి కమిటీ, గణేశ్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఉగాది ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. శ్రీ విశ్వవసు నామ సంవత్సరం ఉగాది తెలుగు నూతన సంవత్సర సందర్భంగా ఉగాది పచ్చడి, భక్షాలు పంపిణీ చేశారు. మాజీ కార్పొరేటర్ వైద్యుల శ్రీదేవి అంజన్ కుమార్, కమిటీ కార్యదర్శులు కాసర్ల ప్రభాకర్, గంగాధర్, రామస్వామి, డాక్టర్ వసంత్ రావు, తదితరులు పాల్గొన్నారు.