MLA Vijayaramana Rao | తారుపల్లి, మీర్జంపేటరోడ్డుకు నిధుల మంజూరు.. ఎమ్మెల్యే విజయరమణారావుకు కృతజ్ఞతలు తెలిపిన గ్రామస్తులు
కాల్వశ్రీరాంపూర్ మండలంలోని తారుపల్లి నుండి మీర్జాంపేట్ రోడ్డు మధ్యలో ఉన్న నక్కల వాగు పై హైలెవల్ బ్రిడ్జ్ నిర్మాణంకు రూ.కోటి55 లక్షల నిధులు మంజూరయ్యాయి. దీంతో ఎమ్మెల్యే విజయ రమణారావు నిధులు మంజూరు చేయించారని తారుపల్లి లో గ్రామస్తులు శుక్రవారం సంబరాలు జరుపుకున్నారు.
MLA Vijayaramana Rao | కాల్వ శ్రీరాంపూర్ సెప్టెంబర్ 19 : కాల్వశ్రీరాంపూర్ మండలంలోని తారుపల్లి నుండి మీర్జంపేట రోడ్డు మధ్యలో ఉన్న నక్కల వాగు పై హైలెవల్ బ్రిడ్జ్ నిర్మాణంకు రూ.కోటి55 లక్షల నిధులు మంజూరయ్యాయి. దీంతో ఎమ్మెల్యే విజయ రమణారావు నిధులు మంజూరు చేయించారని తారుపల్లి లో గ్రామస్తులు శుక్రవారం సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా మీర్జంపేట-తారుపల్లి గ్రామస్తులు టపాసులు పేల్చి స్వీట్లు పంపిణీ చేశారు. ఎన్నో ఏళ్ల నాటికల నెరవేరిందని సంతోషం వ్యక్తం చేశారు. గతంలో ఈ ఒర్రెపై బ్రిడ్జి లేకపోవడం వల్ల మీర్జంపేటలో జరిగే సమ్మక్క సారలమ్మ జాతర వెళ్లేందుకు ఎన్నో ఇబ్బందులు పడ్డామని వారు గర్తు చేశారు.
మా ఇరు గ్రామాల ప్రజల ఇబ్బందులను గమనించిన ఎమ్మెల్యే విజయరామరావు నిధులు మంజూరు చేయించినందుకు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్, మాజీ సర్పంచులు గాజనవీణ సదయ్య, మాదాసి సతీష్, మాజీ ఎంపీటీసీ పోషాల సదానందం, మొగిలి సదానందం, ఏఎంసీ చైర్మన్ రామిడి తిరుపతి రెడ్డి, ఏఎంసీ వైస్ చైర్మన్ సబ్బని రాజమల్లు, యూత్ అధ్యక్షుడు సోన్నాయి టెంకం శివరామకృష్ణ, మాజీ సర్పంచులు మాజీ ఎంపీటీసీలు, డైరెక్టర్లు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సింగరేణి మండలంలో 500 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు
మొక్కల వెంకటయ్యకు సత్కారం
Gayatri Devi | ఇంద్రకీలాద్రిపై గాయత్రీదేవి అలంకారంలో దర్శనమిచ్చిన దుర్గాదేవి
Ranabaali | ట్రైలర్‌కి డుమ్మా కొట్టిన రష్మిక .. ప్రీ రిలీజ్ ఈవెంట్లో విజయ్ దేవరకొండతో కలిసి సందడి
Supreme Court: సుప్రీంకోర్టును రాజకీయాల్లోకి లాగొద్దు: సీజేఐ సూర్యకాంత్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

